మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డిపై కేసు నమోదు
ABN , Publish Date - Aug 11 , 2026 | 11:28 AM
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. విక్రమ్‌తోపాటు మరో 13 మంది వైసీపీ నేతలపైనా కేసులు నమోదయ్యాయి.
నెల్లూరు, ఆగస్టు 11: వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. విక్రమ్‌తోపాటు మరో 13 మంది వైసీపీ నేతలపైనా కేసులు నమోదయ్యాయి. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. గత ఏడాది ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీలో అవకతవకలు జరిగాయంటూ, వీటిపై సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ వైసీపీ నేతలతో కలిసి విక్రమ్‌రెడ్డి గత నాలుగు రోజులుగా ఆత్మకూరులో రిలే నిరాహార దీక్షలు చేశారు.
ఆపై నిన్న(సోమవారం) మున్సిపల్ బస్టాండ్ నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించేందుకు యత్నించారు. అయితే ర్యాలీకి ముందస్తు అనుమతి లేదంటూ జేఆర్‌పేట వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో వైసీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ ర్యాలీకి సంబంధించి అనుమతి లేదంటూ విక్రమ్ రెడ్డితో పాటు 13 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇవి కూడా చదవండి...
భారతమాతకు ధైర్యవంతుడైన కుమారుడు ఖుదీరామ్ బోస్: పవన్ కల్యాణ్
లోకేశ్ ఆదేశాలు.. థాయ్‌లాండ్‌లో విద్యార్థులతో మాట్లాడిన ఏపీ భవన్ అధికారులు
Read Latest AP News And Telugu News