గుడిమల్కాపూర్‌లో బాలుడిపై తండ్రి దాడి ఘటన.. చికిత్స పొందుతూ చిన్నారి మృతి
ABN , Publish Date - Aug 11 , 2026 | 10:37 AM
గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కన్నతండ్రి దాడిలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. ఇటీవల పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్ నంబర్ 104 సమీపంలో తండ్రి సల్మాన్.. కన్న కొడుకు అర్మాన్‌ను పిల్లర్‌కు గుద్ది నేల మీద పడేశాడు.
హైదరాబాద్, ఆగస్టు 11: గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కన్నతండ్రి దాడిలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. ఇటీవల పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్ నంబర్ 104 సమీపంలో తండ్రి సల్మాన్.. కన్న కొడుకు అర్మాన్‌ను పిల్లర్‌కు గుద్ది నేల మీద పడేశాడు. ఆపై డీసీఎం వాహనం కిందకు తోసేందుకు ప్రయత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు.. బాలుడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
భార్యాభర్తల మధ్య గొడవ కారణంగా కొడుకు పట్ల తండ్రి ఇంతటి దారుణానికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ బాలుడు అర్మాన్ ఈరోజు(మంగళవారం) మృతిచెందాడు. భార్యతో గొడవ జరుగుతున్న సమయంలో బాలుడిపై దాడి చేసినట్లు సమాచారం. బాలుడి మృతితో హత్య కేసుగా మారుస్తూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి...
కస్టమర్‌కు ఊహించని షాక్.. సమోసాలో బొద్దింక..
పూడ్చిపెట్టిన పసికందు మృతదేహం మాయం.. పోలీసుల విచారణ
Read Latest Telangana News And Telugu News