నిమ్స్‌లో పిల్లలకు ఉచిత గుండె శస్త్ర చికిత్సలు
ABN , Publish Date - Aug 11 , 2026 | 07:13 AM
పిల్లలకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు నిర్వహించనున్నట్లు నిజామ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) డైరెక్టర్ రాహుల్ దేవరాజ్ తెలిపారు. నిమ్స్‌లో ఈ నెల 13 (గురువారం) నుంచి శస్త్రచికిత్సలు ప్రారంభం కానున్నాయని వెల్లడించారు.
హైదరాబాద్ సిటీ/నిమ్స్, (ఆంధ్రజ్యోతి): పిల్లలకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు నిర్వహించనున్నట్లు నిజామ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) డైరెక్టర్ రాహుల్ దేవరాజ్ తెలిపారు. నిమ్స్‌లో ఈ నెల 13 (గురువారం) నుంచి శస్త్రచికిత్సలు ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. వైద్య పరీక్షల అనంతరం శస్త్రచికిత్స అవసరమున్న చిన్నారులకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం, ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) ద్వారా ఉచితంగా వైద్యం అందిస్తామని పేర్కొన్నారు. ఐదేళ్లుగా ఏటా ఉచిత గుండె శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
పీడియాట్రిక్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ రమణ తన్నషునేని, సాంకేతిక నిపుణుల బృందం సహకారంతో నిమ్స్ కార్డియో థొరాసిక్ సర్జరీ విభాగాధిపతి అమరేశ్వర్ నేతృత్వంలో ఈ శస్త్రచికిత్సలు జరగనున్నాయని వివరించారు. నిమ్స్ పాత బ్లాక్, మొదటి అంతస్తులోని సీటీ సర్జరీ కార్యాలయంలో పరీక్షలు నిర్వహిస్తారని, ఎలాంటి ముందస్తు అపాయింట్‌మెంట్ లేకుండానే చిన్నారులతో నిమ్స్‌కు రావచ్చని తెలిపారు. వివరాలకు 040-23489025 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
ఇవి కూడా చదవండి
మిమ్మల్ని చంపేస్తాం.. గంగూలీ దంపతులకు బెదిరింపు లేఖలు!