Share News

మిమ్మల్ని చంపేస్తాం.. గంగూలీ దంపతులకు బెదిరింపు లేఖలు!

ABN , Publish Date - Aug 11 , 2026 | 07:09 AM

భారత మాజీ కెప్టెన్, బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ, ఆయన భార్య డోనాకు బెదిరింపులు రావడం కలకలం రేపింది. గత ఆరు నెలలుగా గంగూలీ పేరుతో పలు బెదిరింపు లేఖలు వచ్చినట్లు తెలుస్తోంది.

మిమ్మల్ని చంపేస్తాం.. గంగూలీ దంపతులకు బెదిరింపు లేఖలు!
Sourav Ganguly

ఇంటర్నెట్ డెస్క్: భారత మాజీ కెప్టెన్, బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ, ఆయన భార్య డోనాకు బెదిరింపులు రావడం కలకలం రేపింది. గత ఆరు నెలలుగా గంగూలీ పేరుతో పలు బెదిరింపు లేఖలు వచ్చినట్లు తెలుస్తోంది. తొలుత వాటిని పెద్దగా పట్టించుకోకపోయినా.. సోమవారం కార్యాలయానికి వచ్చిన రెండు లేఖల్లో గంగూలీ దంపతులను హతమారుస్తామంటూ హెచ్చరికలు ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.


గంగూలీ మేనేజర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దక్షిణ కోల్‌కతాలోని ఠాకుర్‌పుకూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బెదిరింపు లేఖలు కొరియర్‌ ద్వారా వచ్చినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బెల్ఘరియాకు చెందిన వ్యక్తి ఈ లేఖలు పంపినట్లు అనుమానిస్తున్నారు. కొరియర్‌ సంస్థ నుంచి వివరాలు సేకరిస్తున్న పోలీసులు.. లేఖలతో సంబంధం ఉన్న మొబైల్‌ నంబర్‌, సిమ్‌ కార్డు కదలికలపై ఆరా తీస్తున్నారు. అన్ని లేఖల వెనుక ఒకే వ్యక్తి ఉన్నాడా? బెదిరింపులకు కారణమేంటి? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.


ఇవి కూడా చదవండి:

ఫిట్‌నెస్‌ కోసం 17 కిలోలు తగ్గాడు.. సర్ఫరాజ్ ఖాన్‌ ఈసారైనా నిరూపించుకుంటాడా?

2027 వన్డే ప్రపంచకప్.. జట్టులో చేరేందుకు సిద్ధంగా ఉన్నా: భువనేశ్వర్ కుమార్

Updated Date - Aug 11 , 2026 | 07:09 AM