అల్లూరి ధైర్యసాహసాలు భావితరాలకు స్ఫూర్తిదాయకం: పల్లా శ్రీనివాసరావు
ABN , Publish Date - Jul 04 , 2026 | 10:55 AM
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు త్యాగం, ధైర్యసాహసాలు, దేశభక్తి భావం భావితరాలకు స్ఫూర్తిదాయకమని తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కొనియాడారు. ఆదివాసీల హక్కుల కోసం పోరాడి బ్రిటిష్ పాలనకు సవాల్ విసిరిన మహావీరుడిగా అల్లూరి చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని వ్యాఖ్యానించారు.
విశాఖపట్నం, జులై 4 (ఆంధ్రజ్యోతి): మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు త్యాగం, ధైర్యసాహసాలు, దేశభక్తి భావం భావితరాలకు స్ఫూర్తిదాయకమని తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు (Palla Srinivasa Rao) కొనియాడారు. ఆదివాసీల హక్కుల కోసం పోరాడి బ్రిటిష్ పాలనకు సవాల్ విసిరిన మహావీరుడిగా అల్లూరి చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని వ్యాఖ్యానించారు. అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఈరోజు(శనివారం) గాజువాకలోని ఆయన విగ్రహానికి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. అల్లూరి ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని దేశ, సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పల్లా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.
స్వామి వివేకానంద.. యువతలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించారు: పల్లా శ్రీనివాసరావు
అలాగే, గాజువాకలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్వామి వివేకానంద వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు. యువతలో ఆత్మవిశ్వాసం, దేశభక్తి, సేవాభావాన్ని పెంపొందించిన మహనీయుడు స్వామి వివేకానంద అని పల్లా శ్రీనివాసరావు కొనియాడారు. వివేకానంద చూపిన మార్గం నేటికీ సమాజానికి స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు. యువత వివేకానంద ఆశయాలను ఆదర్శంగా తీసుకుని దేశాభివృద్ధికి తమ వంతుగా కృషి చేయాలని పల్లా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.
కొణిజేటి రోశయ్య.. ప్రజాసేవ పట్ల అంకితభావంతో పనిచేశారు: పల్లా శ్రీనివాసరావు
మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య జయంతి సందర్భంగా పల్లా శ్రీనివాసరావు ఘన నివాళులు అర్పించారు. నిజాయితీ, నిరాడంబరత, ఆర్థిక క్రమశిక్షణతో కూడిన రాజకీయాలకు రోశయ్య ఆదర్శప్రాయమని కొనియాడారు. ప్రజా సమస్యలపై అపారమైన అవగాహన, శాసనసభలో ఆయన చూపిన ప్రతిభ చిరస్మరణీయమని వ్యాఖ్యానించారు. ప్రజాసేవ పట్ల అంకితభావంతో పనిచేసిన నాయకుడిగా రోశయ్య సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు. నేటి తరానికి రోశయ్య జీవితం, విలువలు స్ఫూర్తిదాయకమని పల్లా శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు.
ఈ వార్తలు కూడా చదవండి...
వీబీ -జీ రామ్ జీ పథకంతో పేదల జీవన ప్రమాణాలు పెరుగుతాయి: సీఎం చంద్రబాబు
నా వెంట నడిచిన వారిని ఎప్పటికీ మరిచిపోను: మంత్రి లోకేశ్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News