ఉత్తరాంధ్రలో డేటా సెంటర్ల జోరు
ABN , Publish Date - Jul 30 , 2026 | 07:42 AM
ఉత్తరాంధ్రకు డేటా సెంటర్ల ప్రవాహం కొనసాగుతోంది. అనకాపల్లి జిల్లా మాకవారిపాలెంలో 1000 మెగావాట్ల సామర్థ్యంతో రెన్యూగ్రీన్ ఏపీ గ్రీన్ ఎనర్జీ డేటా సెంటర్ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ వచ్చింది.
ఉత్తరాంధ్రలో డేటా సెంటర్ల జోరు
అనకాపల్లిలో రెన్యూ ఏపీ గ్రీన్ డేటా సెంటర్
85 వేల కోట్లతో వెయ్యి మెగావాట్ల
సెంటర్‌కు ప్రతిపాదన.. ఎస్‌ఐపీసీ ఆమోదం
రాష్ట్రంలో మొత్తం 1,44,943 కోట్ల
పెట్టుబడులకు గ్రీన్‌సిగ్నల్
అమరావతి, జూలై 29(ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్రకు డేటా సెంటర్ల ప్రవాహం కొనసాగుతోంది. అనకాపల్లి జిల్లా మాకవారిపాలెంలో 1000 మెగావాట్ల సామర్థ్యంతో రెన్యూగ్రీన్ ఏపీ గ్రీన్ ఎనర్జీ డేటా సెంటర్ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ వచ్చింది. రూ.85,000 కోట్లతో స్థాపించే ఈ ప్రాజెక్టులో 1,880 మందికి ఉద్యోగాలను కల్పించే ప్రతిపాదనలకు బుధవారం సీఎస్ జి.సాయిప్రసాద్ అధ్యక్షతన జరిగిన రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ (ఎస్‌ఐపీసీ) ఆమోద ముద్ర వేసింది. మొత్తంగా రూ. 1,44,943 కోట్ల పెట్టుబడులతో 9,387 మందికి ఉద్యోగాలను కల్పించే పారిశ్రామిక ప్రతిపాదనలకు సమ్మతి లభించింది. ఇంధన రంగంలో రూ. 17,915.94 కోట్లతో 3,345 మందికి ఉద్యోగాలు కల్పించే పెట్టుబడులకు ఆమోదముద్ర పడింది. రూ.15,000 కోట్లతో 1,500 మందికి ఉద్యోగాలు ఇచ్చే వారీ క్లీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కాకినాడలో గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా ప్లాంట్లు ఏర్పాటు చేస్తుంది.
కర్నూలులో స్థాపించే ప్లాంట్‌తో ఆరాధ్య బయోగ్యాస్ రూ.143.47 కోట్లతో రోజుకు 20 టన్నుల కంప్రెస్డ్ బయోగ్యా్‌సను ఉత్పత్తి చేస్తుంది. నెల్లూరులో రూ.143.47 కోట్లతో ఉషోదయా బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటుచేసి 599మందికి ఉద్యోగాలు కల్పిస్తుంది. టూరిజంలో రూ. 204.10 కోట్లతో 725 మందికి ఉద్యోగాలను కల్పించే ప్రతిపాదనకు, ఇండస్ట్రీ అండ్ కామర్స్ విభాగంలో రూ.9,399.96 కోట్లతో 1,750 మందికి ఉద్యోగాలను కల్పించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. రూ.7,799.96 కోట్లతో 1,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తూ కర్నూలు జిల్లా ఓర్వకల్లులో స్థాపించే అగస్త్య గ్రీన్‌ఎనర్జీ లిమిటెడ్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
హిందాల్కో అల్యూమినియం ఎక్స్‌ట్రాక్షన్ యూనిట్‌కు కుప్పంలోని ఎకర్లపల్లిలో 60ఎకరాలను, ఎస్ట్రెల్ల లాజిస్టిక్స్‌కు విశాఖపట్నం, కనమాంలో ఇంటిగ్రేటెడ్ వేర్‌హౌస్‌ను స్థాపించేందుకు 15 ఎకరాలను కేటాయించింది. విజయనగరం జిల్లా కంటకాపల్లిలో గణేశ సాయి మౌనిశా రూ.68 కోట్లతో స్థాపించే స్టీల్‌వైర్ ఇండస్ట్రీస్‌కు 7.5 ఎకరాలు కేటాయుంచాలని నిర్ణయించింది. విశాఖ జిల్లా అడవివరంలోని తర్లువాడలో అదానీ డేటా సెంటర్(గూగుల్ డేటా సెంటర్ ఎస్పీవీ) రాంబిల్లిలో కేటాయించిన దేవదాయశాఖ భూములకు అద్దె ఒప్పందంలో మార్పులకు ఎస్‌ఐపీసీ ఆమోదం తెలిపింది. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పైనాంపురంలో స్థాపించే ఎస్‌ఈఐఎల్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్‌కు 680.55 ఎకరాలను కేటాయించడానికి సమ్మతి తెలిపింది.
వార్తలు కూడా చదవండి...
చంద్రబాబు దూరదృష్టితో కుప్పంకు ఇజ్రాయిల్ టెక్నాలజీ: నారా భువనేశ్వరి
జీవ వైవిధ్య పరిరక్షణలో పులుల పాత్ర అమోఘం: పవన్ కల్యాణ్
ఏపీ మద్యం స్కాం.. కారుమూరికి సుప్రీంకోర్టులో షాక్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News