Major Fire Accident: ఏపీలో భారీ అగ్నిప్రమాదం.. ఒక్కసారిగా మంటలు వ్యాపించి..
ABN , Publish Date - Jan 03 , 2026 | 06:44 PM
ఏపీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈఘటన అచ్యుతాపురం సెజ్‌లో సంభవించింది. రాంబిల్లి మండలం ఎస్‌వీఎస్ ఫార్మా కంపెనీలో మంటలు ఒక్కసారిగా అంటుకున్నాయి. ఈ క్రమంలో మంటలు దట్టంగా వ్యాపించాయి.
అనకాపల్లి, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): ఏపీలో భారీ అగ్నిప్రమాదం (Major Fire Accident) జరిగింది. ఈఘటన అచ్యుతాపురం సెజ్‌లోని రాంబిల్లి మండలం SVS ఫార్మా కంపెనీలో ఇవాళ (శనివారం) సంభవించింది. సదరు కంపెనీ ఆవరణలో ఒక్కసారిగా మంటలు వ్యాపించి, పరిస్థితి ఆందోళనకరంగా మారింది. మంటలు వేగంగా వ్యాపించడంతో, అక్కడి స్థానికులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేశారు.
సమాచారం అందగానే అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకురావడానికి ఫైర్ సేఫ్టీ సిబ్బంది క్రమంగా ప్రయత్నిస్తున్నారు. మంటల ప్రభావం దృష్ట్యా స్థానికుల భద్రత పరంగా దూరంగా పంపించారు. ఈ ప్రమాదాన్ని నియంత్రణలోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టారు.
అధికారులకు హోంమంత్రి అనిత ఆదేశాలు..

మరోవైపు.. ఈ అగ్నిప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత వెంటనే స్పందించారు. మంటల పరిస్థితి, కంపెనీ సిబ్బంది, స్థానికుల భద్రత గురించి పర్యవేక్షణ కోసం అనకాపల్లి కలెక్టర్ విజయ్ కృష్ణన్, ఎస్పీ తుహిన్ సిన్హాతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మంటలను తక్షణమే అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఈ పరిస్థితిని సురక్షితంగా నియంత్రిస్తున్నామని అధికారులు వెల్లడించారు. అగ్నిప్రమాదం నిర్వహణలో ఫైర్ సేఫ్టీ, పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి వంగలపూడి అనిత ఆదేశాలు జారీ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
వైసీపీ హయాంలో డ్రగ్స్‌కి.. ఏపీ క్యాపిటల్‌గా ఉండేది..
గంజాయికి ‘నో’ చెప్పి భవిష్యత్ సురక్షితం చేసుకోండి
Read Latest AP News And Telugu News