వేమగిరి అభివృద్ధికి కృషి చేస్తున్నాం: హోంమంత్రి అనిత
ABN , Publish Date - Jun 07 , 2026 | 06:43 PM
వేమగిరి అభివృద్ధికి ఎంతగానో తాము కృషి చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. వేమగిరిలో చిన్నచిన్న సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
అనకాపల్లి జిల్లా, జూన్7 (ఆంధ్రజ్యోతి): వేమగిరి అభివృద్ధికి ఎంతగానో తాము కృషి చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత (AP Home Minister Vangalapudi Anitha) వ్యాఖ్యానించారు. వేమగిరిలో చిన్నచిన్న సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈరోజు(ఆదివారం) ఎస్ రాయవరం మండలం వేమగిరిలో హోం మంత్రి అనిత పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనితకు ఘన స్వాగతం పలికారు గ్రామస్తులు. అడుగడుగున హారతులతో స్వాగతం పలికారు మహిళలు. వేమగిరిలో సాయిబాబా ఆలయంలో పూజలు చేశారు. రూ.70 లక్షల నిధులతో వేమగిరిలోని ధర్మవరం- యలమంచిలిలో నిర్మించిన రోడ్డును ప్రారంభించారు. అనంతరం విశాఖ డైరీ నిధులతో నిర్మించిన శ్రీ తులసి కల్యాణ మండపాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడారు.
ప్రజల ఆశీర్వాదంతో మంచి మెజార్టీతో తాను గెలిచానని హోంమంత్రి అనిత చెప్పుకొచ్చారు. ఎన్నో కుటుంబాలకు వెలుగులు నింపిన వ్యక్తి ఆడారి తులసిరావు అని కొనియాడారు. తనను సొంత కూతురులాగే తులసిరావు చూసుకునేవారని చెప్పుకొచ్చారు. విశాఖ డైరీ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటారని ప్రస్తావించారు. పాయకరావుపేట నియోజకవర్గంలో కూడా చాలా కార్యక్రమాలు చేశారని తెలిపారు. వేమగిరిలో రూ.70 లక్షలతో రోడ్డు నిర్మించామని అన్నారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చానని.. ఇచ్చిన హామీ ప్రకారం రూ.70 లక్షలతో రోడ్డు వేశామని వెల్లడించారు.
రూ.40 లక్షలతో రామాలయానికి నిధులు మంజూరయ్యాయని వివరించారు. రైతులకు సాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అడ్డరోడ్డు కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేశామని ప్రస్తావించారు. ఉపమాక ఆలయంలో చోరీ జరిగిన రెండు రోజుల్లో దొంగలను పోలీసులు పట్టుకున్నారని తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులను హోంమంత్రి అనిత అభినందించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
గొడ్డలి పార్టీ ఆగడాలు శ్రుతిమించితే వదిలిపెట్టం.. సీఎం స్ట్రాంగ్ వార్నింగ్
జగన్ హయాంలో ఎన్నో అరాచకాలు, అక్రమాలకు పాల్పడ్డారు: హోంమంత్రి అనిత
Read Latest Telangana News And AP News And National News
And Telugu News