ఆ విద్యార్థి కుటుంబానికి అన్నివిధాలుగా అండగా ఉంటా: హోం మంత్రి అనిత
ABN , Publish Date - Aug 13 , 2026 | 08:23 AM
ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లిలో గురువారం పర్యటించారు. నక్కపల్లిలో రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి సంక్షేమం ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు.
అనకాపల్లి జిల్లా , ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత (AP Home Minister Anitha) అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లిలో ఈరోజు (గురువారం) పర్యటించారు. నక్కపల్లిలో రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి సంక్షేమం ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. అనితకు అడుగడుగున హారతులతో మహిళలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హోం మంత్రి ఇంటింటి ప్రచారం చేశారు.
గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించారు. అనంతరం ఇటీవల మృతిచెందిన విద్యార్థి వరహాలు బాబు కుటుంబ సభ్యులను పరామర్శించారు. వరహాలు బాబు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఆ విద్యార్థి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని హోం మంత్రి అనిత భరోసా ఇచ్చారు.
వార్తలు కూడా చదవండి...
చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కఠినంగా వ్యవహరించాలి: సీఎం చంద్రబాబు
అమరావతి అభివృద్ధిలో మరో ముందడుగు.. సీడ్ యాక్సిస్ రోడ్డు, రెండు స్టీల్ బ్రిడ్జిల ప్రారంభం
నటి కాదంబరీ జెత్వానీ కేసులో కీలక పరిణామం
Read Latest AP News And Telangana News And National News
And Telugu News