మత్స్యకారుల గల్లంతుపై గాలింపు చర్యలు ముమ్మరం చేయాలి.. సీఎం చంద్రబాబు ఆదేశాలు
ABN , Publish Date - Jul 05 , 2026 | 10:00 AM
విశాఖపట్నం నుంచి వెళ్లి సముద్రంలో ఏడుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
చిత్తూరు జిల్లా, జులై 5 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం నుంచి వెళ్లి సముద్రంలో ఏడుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) ఉన్నతాధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే కుప్పం నుంచి ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడారు సీఎం. మత్స్యకారులను రక్షించేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. బంగాళాఖాతంలో గల్లంతైన మత్స్యకారుల బోటును గాలించేందుకు కోస్టుగార్డు నౌక ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రికి వివరించారు అధికారులు.
గంగవరం సముద్ర తీరం సమీపంలో వారి బోటుకు సాంకేతిక సమస్య ఉత్పన్నమైనట్టుగా గుర్తించామని వివరించారు అధికారులు. ఇవాళ ఉదయం నుంచి నౌకాదళానికి చెందిన హెలికాప్టర్ల ద్వారా కూడా గాలింపు చర్యలు చేపట్టినట్లు వివరించారు అధికారులు. ఈ విషయంపై స్పందించిన సీఎం.. సముద్రంలో చేపడుతున్న గాలింపు చర్యలను సమన్వయం చేసుకోవాల్సిందిగా మెరైన్ ఐజీ, విశాఖ సీపీలను ఆదేశించారు. గాలింపు చర్యలకు సంబంధించిన అంశాలను తనకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని సీఎం సూచించారు. మత్స్యకారుల కుటుంబాలకు ధైర్యం చెప్పాలని మంత్రి అచ్చెన్నాయుడు, స్థానిక విశాఖ ప్రజాప్రతినిధులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు.
యుద్ధప్రాతిపదికన గాలింపు చర్యలు చేపట్టాలి: హోం మంత్రి అనిత

విశాఖలో మత్స్యకారుల గల్లంతు ఘటనపై ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత ఆరా తీశారు. కలెక్టర్, ఎస్పీ, మత్స్యశాఖ అధికారులతో ఫోన్‍లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కోస్టుగార్డ్ నౌకలతో గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. గల్లంతైన మత్స్యకారుల కోసం యుద్ధప్రాతిపదికన గాలింపు చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హోం మంత్రి అనిత భరోసా కల్పించారు.
మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది: మంత్రి అచ్చెన్నాయుడు

విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి చేపలవేటకు వెళ్లి ఏడుమంది మత్స్యకారులు గల్లంతైన ఘటనపై ఏపీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు (Minister Kinjarapu Atchannaidu) ఆరా తీశారు. జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. గల్లంతైన మత్స్యకారుల కోసం యుద్ధప్రాతిపదికన గాలింపు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి భరోసా కల్పించారు. వర్షం ప్రభావం ఎక్కువగా ఉన్న సమయంలో చేపల వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
అల్లూరి ఆశయాలే దేశానికి మార్గదర్శకం: పవన్ కల్యాణ్
డ్వాక్రా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేలా తృప్తి క్యాంటీన్‌లను ప్రోత్సహిస్తున్నాం: మంత్రి నారాయణ
Read Latest AP News And Telangana News And National News
And Telugu News