విశాఖకు గూగుల్ రాక ఏపీకే గేమ్‌ఛేంజర్: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Apr 28 , 2026 | 11:45 AM
ఏపీ చరిత్రలో ఇవాళ మరిచిపోలేని రోజు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఇవాళ ఒక చరిత్రకు శ్రీకారం చుట్టామని ఉద్ఘాటించారు.
విశాఖపట్నం, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): ఏపీ చరిత్రలో ఇవాళ మరిచిపోలేని రోజు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandra babu Naidu) వ్యాఖ్యానించారు. ఇవాళ ఒక చరిత్రకు శ్రీకారం చుట్టామని ఉద్ఘాటించారు. విశాఖకు గూగుల్ రాక ఏపీకే గేమ్‌ఛేంజర్ అని అభివర్ణించారు. ఈరోజు (మంగళవారం) తర్లువాడలో రూ.1.35 లక్షల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న గూగుల్ ఏఐ డేటా సెంటర్‌కు సీఎం భూమిపూజ చేశారు. విశాఖ గూగుల్ డేటా సెంటర్ దేశానికే గ్రోత్ ఇంజిన్ అని పేర్కొన్నారు.
గూగుల్ రాక ఉత్తరాంధ్రకే గర్వకారణం..
విశాఖకు గూగుల్ రాక ఉత్తరాంధ్రకే గర్వకారణమని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటవుతోందని తెలిపారు. విశాఖను గూగుల్ ఎంపిక చేసుకోవడం ఏపీకి గర్వకారణమని వ్యాఖ్యానించారు. గూగుల్, ఎయిర్‌టెల్ రెండూ కీలక సంస్థలని వెల్లడించారు. సెప్టెంబర్ 2028 నాటికి గూగుల్ డేటా సెంటర్ పూర్తవుతుందని స్పష్టం చేశారు. అతి త్వరలో అన్నిరంగాల్లో ఏఐ సేవలు వస్తాయని వివరించారు. 60 రోజుల్లో అనకాపల్లి, విశాఖపట్నానికి గోదావరి నీళ్లు వస్తాయని చెప్పుకొచ్చారు.
పుష్కరాలకు ముందే పోలవరం ప్రారంభిస్తాం..
గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. విశాఖకు అద్భుతమైన కనెక్టివిటీ ఉందని తెలిపారు. 2028 చివరినాటికి ఆర్సెలార్ మిట్టల్ ప్లాంట్ తొలిదశ పూర్తి చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఏఐ సిటీగా విశాఖ ఉంటుందని.. మరో రంగారెడ్డి జిల్లాగా అనకాపల్లి కాబోతుందని తెలిపారు. టెక్నాలజీలో దేశానికే గేట్‌వేగా ఆంధ్రప్రదేశ్ ఉందని వెల్లడించారు. పెట్టుబడిదారులే ఏపీకి భాగస్వాములని చెప్పారు. ఒప్పందాలే కాదని.. గ్రౌండింగ్ కూడా తమదే బాధ్యత అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఇంధనాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తే కఠిన చర్యలు: సీఎం చంద్రబాబు
ప్రయాణికుల సేవల్లో ఎలాంటి అంతరాయం ఉండొద్దు: మంత్రి మండిపల్లి
Read Latest AP News And Telangana News And International News And Telugu News