Share News

అనకాపల్లి జిల్లాలో టోరెంటో ఫార్మా కంపెనీలో ప్రమాదం

ABN , Publish Date - Jul 13 , 2026 | 02:14 PM

అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మసిటీలోని టోరెంటో ఫార్మా కంపెనీలో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఉద్యోగి ఎన్. నాగరాజు (36) తీవ్రంగా గాయపడ్డారు.

అనకాపల్లి జిల్లాలో టోరెంటో ఫార్మా కంపెనీలో ప్రమాదం
Anakapalli Pharma City Accident

అనకాపల్లి జిల్లా, జులై 13 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మసిటీలోని టోరెంటో ఫార్మా కంపెనీలో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఉద్యోగి ఎన్. నాగరాజు (36) తీవ్రంగా గాయపడ్డారు. నైట్ షిఫ్ట్‌లో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కంపెనీలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగుల్లో ఒకరిపై ప్రమాదవశాత్తూ కెమికల్ పడటంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి.


నాగరాజుది భీమిలి మండలం తగరపువలస. విధి నిర్వహణలో ఉండగా కెమికల్ ఆయనపై పడటంతో ఎడమ చేతికి, ఎడమ కంటికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం జరిగిన వెంటనే నాగరాజును చికిత్స నిమిత్తం విశాఖపట్నంలోని కిమ్స్ ఐకాన్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. ప్రమాదం ఎలా జరిగింది? అనే అంశాలపై సంస్థ యాజమాన్యం, సంబంధిత అధికారులు విచారణ చేపట్టారు. పారిశ్రామిక ప్రమాదాల్లో ఉద్యోగుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి...

ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్ తిరుగులేని శక్తిగా ఎదుగుతుంది: సీఎం చంద్రబాబు

సీఆర్డీఏ ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఊరట

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jul 13 , 2026 | 02:35 PM