కళల రాజధాని విజయవాడ అని చాటిచెప్పేలా దేవీ నవరాత్రోత్సవాలు: మంత్రి కేశినేని
ABN , Publish Date - Sep 27 , 2026 | 11:19 AM
ఈ ఏడాది దేవీ నవరాత్రోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని పేర్కొన్నారు. ఈ మేరకు భక్తులు పెద్ద సంఖ్యలో ఉత్సవాల్లో పాల్గొనాలని కోరుకున్నారు.
విజయవాడ, సెప్టెంబర్ 27: దుర్గమ్మ ఆశీస్సులతో గత ఏడాది నవరాత్రోత్సవాలు ఘనంగా నిర్వహించామని.. ఈ ఏడాది కూడా మరింత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారన్నారు.
సాంస్కృతిక, కళల రాజధాని విజయవాడ అని మరోసారి చాటిచెప్పే విధంగా ఈ ఏడాది నవరాత్రోత్సవాలను నిర్వహిస్తామని మంత్రి కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. నవరాత్రుల సందర్భంగా విజయవాడ ఉత్సవ్, నేషనల్ సరస్సు మేళ, పసందైన వంటకాలతో ఫుడ్ ఫెస్టివల్‌ను నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. రేపు(సోమవారం) నిర్వహించే కర్టెన్ రైజ్ ఈవెంట్‌లో ఉత్సవాలలో జరిగే అన్నీ కార్యక్రమాల గురించి వివరిస్తామన్నారు. ఈ మేరకు అక్టోబర్ 8 నుంచి 23 వరకు సరస్సు మేళ, అక్టోబర్ 11 నుంచి 20 వరకు విజయవాడ ఉత్సవ్ కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. పున్నమి ఘాట్, ఎం.బి.కె స్టేడియంలో ఈ కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తికానున్నాయని మంత్రి తెలిపారు. వీటితోపాటు పది రోజుల వరకు కళాకారుల ప్రదర్శనలు ఉంటాయన్నారు. ఈ ఉత్సవాలకు మైసూరు ఏనుగులను కూడా తీసుకువచ్చే ఏర్పాట్లు చేస్తామన్నాని మంత్రి తెలిపారు.
ఇతర రాష్ట్రాల సీఎంలను, కేంద్రమంత్రులను ఈ ఉత్సవాలకు ఆహ్వానిస్తున్నామని కేశినేని తెలిపారు. అనేక రాష్ట్రాల సీఎంలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆయా రాష్ట్రాల సంస్కృతిని ప్రతిబింబించేలా కార్యక్రమాలను రూపొందించామన్నారు. అమ్మవారి దర్శనం, సరస్సు మేళ, విజయవాడ ఉత్సవ్ మూడూ చూసుకునేలా అతిథులకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. భక్తులు కూడా తమ షెడ్యూల్‌ను రెండు రోజులకు ప్లాన్ వేసుకోవాలని.. ఉదయం అమ్మవారిని దర్శనం చేసుకుని, సాయంత్రం ఈ ఉత్సవాలను వీక్షించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్నిరకాల ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రజలు, మీడియా కూడా మంచి సలహాలు ఇస్తే తీసుకుంటామని మంత్రి కేశినేని పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రాంచందర్‌రావుతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి భేటీ
మన్మోహన్ ఫెలోషిప్ రెండో బ్యాచ్ ఎంపిక షురూ
For More TG News And Telugu News