వాన్పిక్ కేసులో కీలక పరిణామం.. మాజీ ఐఏఎస్ విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం
ABN , Publish Date - Oct 15 , 2026 | 06:21 PM
వాన్పిక్ మనీలాండరింగ్ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలకనిర్ణయం తీసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఐఏఎస్ కేవీ బ్రహ్మానందరెడ్డిని విచారణ చేసేందుకు ఈడీకి అనుమతులిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అమరావతి, అక్టోబర్ 15: గత ప్రభుత్వ హయాంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ శాఖా ప్రత్యేక కార్యదర్శిగా పనిచేసిన కేవీ బ్రహ్మానందరెడ్డి.. జగన్తో కుమ్మకై.. వాన్పిక్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి ప్రయోజనం చేకూరేలా నిర్ణయాలు తీసుకున్నారని ఈడీ ఆరోపణలు చేస్తోంది. ఈ మేరకు బ్రహ్మానందరెడ్డిని విచారణ చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఈడీ కోరగా.. రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. మాజీ ఐఏఎస్ను విచారణ చేయడానికి ఈడీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
వైఎస్ఆర్సీపీ అధినేత జగన్తో కలిసి కేవీ బ్రహ్మానందరెడ్డి అక్రమాలకు పాల్పడ్డారని ఈడీ ఆరోపణలు చేస్తోంది. వాడరేవు నిజాంపట్నం ఓడరేవు పారిశ్రామిక కారిడార్ (వాన్పిక్) కంపెనీకి ప్రత్యేక ప్రయోజనాలు చేకూరేలా అప్పటి ప్రత్యేక కార్యదర్శి బ్రహ్మానందరెడ్డి నిర్ణయాలు తీసుకుని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపణలున్నాయి. ఈ కేసులో జగన్ ప్రధాన నిందితుడు కాగా.. కేవీ బ్రహ్మానందరెడ్డిని ఈడీ 18వ నిందితుడిగా చేర్చింది. కాగా.. ఈడీ విచారణలో కేసుకు సంబంధించి పలు కీలక అంశాలు వెలుగుచూసే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి...
17 వసంతాలు పూర్తి చేసుకున్న ‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి’.. మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు
ఏబీఎన్ 17వ వార్షికోత్సవం.. సీఎం చంద్రబాబు విషెస్
Read Latest AP News And Telugu News