ఎమ్మెల్యేలకు పయ్యావుల ఆదర్శం.. ఉరవకొండ అభివృద్ధి నివేదికపై సీఎం ప్రశంసలు
ABN , Publish Date - Oct 11 , 2026 | 04:21 PM
ఉరవకొండ ఎమ్మెల్యే, ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ ఆయన నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను వివరిస్తూ.. ‘ఉరవకొండ అభివృద్ధి నివేదిక’ పేరుతో రాసిన పుస్తకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు స్వయంగా అందజేశారు.
అమరావతి, అక్టోబర్ 11: రాష్ట్రంలోని ఉరవకొండ నియోజక వర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ రూపొందించిన పుస్తకాన్ని ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే, ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందించారు.
ఈ మేరకు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధికి తోడ్పడిన పలు కార్యక్రమాల గురించి కేశవ్ సీఎంకు వివరించారు. ఉరవకొండకు తాగునీరు సదుపాయం కల్పించడం, హంద్రీ నీవా కాలువను వెడల్పు చేయడం వల్ల జరిగిన లబ్ది, నియోజకవర్గంలో చేపట్టిన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, పల్లెల్లో సిమెంట్ రోడ్లు, నూతన భవనాల మంజూరు వంటి కార్యక్రమాల గురించి ఆయన సీఎంకు వివరించారు. దానితోపాటు.. రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో గ్రామస్థాయిలో వచ్చిన మార్పులను సమగ్రంగా పుస్తకంలో పొందుపరిచినట్లు చెప్పారు. వివిధ శాఖల్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను తెలియజేసే ఈ పుస్తకం.. నియోజకవర్గానికి ఓ ప్రొగ్రెస్ కార్డులా పనిచేస్తుందని మంత్రి పేర్కొన్నారు.
అనంతరం సీఎం చంద్రబాబు స్పందిస్తూ.. మంత్రి పయ్యావుల కేశవ్‌ను కొనియాడారు. మిగతా ఎమ్మెల్యేలు మంత్రిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. గత ప్రభుత్వంలో విధ్వంసానికి, కూటమి ప్రభుత్వంలో వికాసానికి మధ్య తేడాను వివరించేలా ఎమ్మెల్యేలు ఈ తరహా నివేదికలను, ప్రోగ్రెస్ కార్డులను ప్రజలకు అందుబాటులో ఉంచాలని సీఎం అభిప్రాయపడ్డారు. అభివృద్ధి పనులతో పాటు.. ఆయా పనుల వివరాలను కూడా నిత్యం ప్రజలకు తెలియజేయాలని ముఖ్యమంత్రి పయ్యావుల కేశవ్‌కు సూచించారు. కాగా.. పలు అభివృద్ధి పనులకు, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేసి.. నియోజక వర్గ అభివృద్ధికి సహకరిస్తున్నందుకు ముఖ్యమంత్రికి మంత్రి పయ్యావుల ధన్యవాదాలు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక కార్యాచరణ: పవన్ కల్యాణ్
తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సిబ్బందికి ప్రమాదం
For More AP News And Telugu News