Share News

తిరుపతిలో చైన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్.. రూ.57 లక్షల బంగారం స్వాధీనం

ABN , Publish Date - Oct 19 , 2026 | 06:09 PM

బెట్టింగులు, జల్సాలకు బానిసలై.. చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ఓ ముఠాను తిరుపతి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు నిందితుల నుంచి రూ.57 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

తిరుపతిలో చైన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్.. రూ.57 లక్షల బంగారం స్వాధీనం
4 chain snatchers arrested in tirupathi

తిరుపతి, అక్టోబర్ 19: జిల్లాలోని ఒంటరి మహిళలే లక్ష్యంగా చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న నలుగురు వ్యక్తుల ముఠాను తిరుపతి పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.57 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నిందితులను పట్టుకోవడానికి కృషి చేసిన పోలీసులకు డీఎస్పీ రివార్డులు ప్రకటించారు.


తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలను డీఎస్పీ సుబ్బారాయుడు వెల్లడించారు. జిల్లాలోని ఏర్పేడు మండలానికి చెందిన చల్లా రాజేష్, చిట్టత్తూరు పవన్ కల్యాణ్, రేణిగుంట మండలానికి చెందిన బొంద శివరామకృష్ణ, మేకల కిషోర్ అనే నలుగురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి జిల్లాలో చైన్‌స్నాచింగ్స్‌కు పాల్పడుతుంటారు. ఒంటరి మహిళలనే లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న ఈ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. జల్సాలకు, బెట్టింగ్‌లకు అలవాటు పడి ఈజీ మనీ కోసం దొంగతనాలకు పాల్పడుతున్నట్లు నిందితులు అంగీకరించారు. కాగా.. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి రూ.57 లక్షల విలువ చేసే 352 గ్రాముల బంగారాన్ని, 3 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వడమాల‌పేటలో 1, రామచంద్రాపురంలో 4, తిరుచానూరు పరిధిలో 8 చైన్ స్నాచింగ్‌లకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు మొత్తం 13 కేసుల్లో బంగారాన్ని రికవరీ చేసి బాధితులకు సమాచారం అందించినట్లు ఎస్పీ సుబ్బారాయుడు వెల్లడించారు.


ఇవి కూడా చదవండి...

ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయం వద్ద శిల్పా చక్రపాణి రెడ్డి హల్‌చల్

‘హింస అనేది వాళ్ల డీఎన్‌ఏలోనే ఉంది’.. వైసీపీపై సీఎం చంద్రబాబు ఆగ్రహం

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 19 , 2026 | 06:09 PM