Share News

విజయవాడ సీఐ అలీ మృతి కేసులో కీలక పరిణామం.. నిజంగా గుండెపోటేనా?!

ABN , Publish Date - Sep 28 , 2026 | 10:02 AM

విజయవాడ సచివాలయం ఉద్యోగుల నిరసనలో మృతిచెందిన సీఐ అలీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అనుమానాస్పద, అసహజ స్థితిలో సీఐ మరణించారని పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

విజయవాడ సీఐ అలీ మృతి కేసులో కీలక పరిణామం.. నిజంగా గుండెపోటేనా?!
key developments in ci ali case

విజయవాడ, సెప్టెంబర్ 28: జిల్లాలోని ధర్నాచౌక్ వద్ద సచివాలయం ఉద్యోగులు చేపట్టిన నిరసనలో బందోబస్తు విధులు నిర్వర్తిస్తున్న ఇన్‌స్పెక్టర్ షేక్ అహ్మద్ అలీ ఆదివారం ఆకస్మికంగా మరణించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సీఐ అనుమానాస్పద స్థితిలో మరణించారని పోలీసులు కేసు నమోదు చేశారు.


విధులు నిర్వర్తిస్తున్న సమయంలో తీవ్ర ఒత్తిడి కారణంగా.. అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి సీఐ మరణించినట్లు ఘటనా స్థలంలో ఉన్న కానిస్టేబుల్ సుధాకర్ తెలిపారు. సచివాలయ ఉద్యోగులు సీఐ అలీని నెట్టుకుంటూ వెళ్లారని.. దీంతో సీఐ కింద పడిపోయారని ఆయన తెలిపారు. ఆ తర్వాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులకు గురై హార్ట్ స్ట్రోక్ వచ్చిందని కానిస్టేబుల్ స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా.. సీఐ అనుమానాస్పద స్థితిలో మరణించినట్లు సత్యనారాయణపురం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీ వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త.. పదోన్నతులకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్

విశాఖలో మీడియా సమావేశం పెడతా.. ఆ విషయాలపై మాట్లాడతా: విజయసాయి రెడ్డి

శవ రాజకీయాలు చేసే స్థాయికి వైసీపీ నేతలు దిగజారారు: మంత్రి నిమ్మల

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Sep 28 , 2026 | 10:52 AM