మాజీ మంత్రి కాకాణికి షాక్.. టీడీపీలోకి భారీగా చేరికలు
ABN , Publish Date - Oct 22 , 2026 | 05:38 PM
వైసీపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి షాక్ తగిలింది. సర్వేపల్లి నియోజకవర్గంలో వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరారు.
నెల్లూరు జిల్లా, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): వైసీపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి షాక్ తగిలింది. సర్వేపల్లి నియోజకవర్గంలో వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరారు. తోటపల్లి, కోడూరు వైసీపీ నేతలు టీడీపీలో జాయిన్ అయ్యారు. కోడూరుకు చెందిన 30 కుటుంబాలు, తోటపల్లికి చెందిన 25 కుటుంబాలు టీడీపీలోకి వచ్చాయి. వైసీపీకి భవిష్యత్తు లేకపోవడంతోనే ఆ పార్టీని వీడుతున్నట్లు నేతలు, కార్యకర్తలు ప్రకటించారు. వారికి పసుపు కండువాలు కప్పి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆత్మీయ ఆహ్వానం పలికి టీడీపీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఇవి కూడా చదవండి...
విశాఖలో రోడ్డు ప్రమాదం.. గాయపడిన విద్యార్థులకు హోంమంత్రి అనిత సాయం
నకిలీ వాట్సాప్ నిర్వాహకులకు పవన్ కల్యాణ్ కార్యాలయం హెచ్చరిక
Read Latest AP News And Telugu News