Share News

టీడీపీ నేత ప్రభాకర్ నాయుడు కన్నుమూత

ABN , Publish Date - Oct 03 , 2026 | 02:42 PM

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మున్సిపల్ ఛైర్మన్, డాక్టర్ ప్రభాకర్ నాయుడు అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు.

టీడీపీ నేత ప్రభాకర్ నాయుడు కన్నుమూత
TDP Leader Prabhakar Naidu

నెల్లూరు జిల్లా, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మున్సిపల్ ఛైర్మన్, డాక్టర్ ప్రభాకర్ నాయుడు అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. పేద, నిరుపేదలకు తక్కువ ఖర్చులతో వైద్యం అందించి ఆయన మానవత్వం చాటుకున్నారు. లక్షకు పైగా శస్త్ర చికిత్సలు నిర్వహించి పలు రికార్డులు సృష్టించారు. ప్రభాకర్ నాయుడు మృతి పట్ల ఎమ్మెల్యేలు కావ్య కృష్ణారెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.


వైద్యరంగంలో ప్రభాకర్ నాయుడు అందించిన నిరుపమానమైన సేవలు, ప్రజల పట్ల చూపే ఆత్మీయత, మానవత్వం ఎన్నటికీ చిరస్మరణీయమని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కొనియాడారు. ప్రభాకర్ నాయుడుతో తమకెంతో అనుబంధం ఉందని గుర్తుచేసుకున్నారు. ఆయన మృతి తమకు తీరని లోటని తెలిపారు‌. మున్సిపల్ ఛైర్మన్‌గా, డాక్టర్‌గా ప్రభాకర్ నాయుడు అందించిన సేవలు మరువలేనివని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రాయలసీమను గ్లోబల్‌ హార్టికల్చర్‌ హబ్‌గా తయారు చేస్తాం: సీఎం చంద్రబాబు

నన్ను ఆంధ్ర బిడ్డగా భావించండి: అనంత్‌ అంబానీ

ప్రభుత్వ విద్యాసంస్థలపై నమ్మకాన్ని పెంచుతున్నాం: ఎంపీ శ్రీభరత్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Oct 03 , 2026 | 03:06 PM