నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. బైక్‌ను ఢీకొట్టిన కారు.. ఇద్దరి మృతి
ABN , Publish Date - Oct 01 , 2026 | 03:03 PM
నెల్లూరు జిల్లా కలువాయి మండలంలో బైక్‌ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు.
నెల్లూరు, అక్టోబర్ 1: నెల్లూరు జిల్లా కలువాయి మండలంలోని వెంకటరామరాజుపేట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ఓ కారు జాతీయ రహదారి 565పై బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతసాగరం మండలం పాతదేవరాయపల్లికి చెందిన షేక్ రసూల్ బాషా (47), మణికల సుధాకర్ (45) పెయింట్ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఈరోజు (గురువారం) చింతలపాలెం గ్రామంలో పనులు ముగించుకుని స్వగ్రామానికి తిరిగి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. కారు ఢీకొట్టడంతో రసూల్, సుధాకర్ మరణించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఈ వార్తలూ చదవండి
బైక్‌ను ఢీకొట్టి కాలువలో బోల్తా పడిన స్కూల్ బస్సు.. 30 మంది విద్యార్థులకు గాయాలు
తిరుపతి శివార్లలో చెడ్డీ గ్యాంగ్ కలకలం