Share News

నెల్లూరులో మరో 4 వేల పట్టాల పంపిణీకి కృషి చేస్తా: మంత్రి నారాయణ

ABN , Publish Date - Oct 11 , 2026 | 08:44 PM

నెల్లూరు నగరంలోని జాఫర్ సాహెబ్ కాలువ కట్ట, జాకీర్ హుస్సేన్ నగర్‌లలోని నిర్వాసితులకు త్వరలో ఇంటి పట్టాలు పంపిణీ చేస్తామని మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ హామీ ఇచ్చారు.

నెల్లూరులో మరో 4 వేల పట్టాల పంపిణీకి కృషి చేస్తా: మంత్రి నారాయణ
AP Minister P Narayana

నెల్లూరు, అక్టోబర్ 11: నగరంలోని జాఫర్ సాహెబ్ కాలువ కట్ట, జాకీర్ హుస్సేన్ నగర్‌లలోని నిర్వాసితులకు త్వరలో ఇంటి పట్టాలు పంపిణీ చేస్తామని మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ హామీ ఇచ్చారు. సీఎం చంద్రబాబు సహకారంతో సిటీలో మరో 4 వేల పట్టాల పంపిణీకి కృషిచేస్తానని నిర్వాసితులకు ఆయన భరోసా ఇచ్చారు. ఆదివారం నెల్లూరులో సర్వేపల్లి కాలువ కట్ట వాసులకు ఆయన ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. సీఎం చంద్రబాబు వర్చువల్ విధానంలో ఈ పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.


ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. పండగ వాతావరణంలో పేదలకి పట్టాభిషేకం జరిగిందని అన్నారు. సర్వేపల్లి కాలువ కట్టలపై నివసించే వారికి ఇంటి పట్టాలు లేక ఇబ్బందులు పడ్డారని చెప్పారు. నిర్వాసితులకి గొడ్డలి పార్టీ నమ్మకద్రోహం చేసిందని మండిపడ్డారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు పనికిరాని పట్టాలు ఇచ్చి మభ్యపెట్టిందని విమర్శించారు. కాలువ కట్టవాసుల సమస్యను తన దృష్టికి తీసుకొచ్చారని గుర్తు చేసుకున్నారు.


అలాగే శాశ్వత పట్టాలు ఇప్పించాలని వారంతా విజ్ఞప్తి చేశారని చెప్పారు. ఆ ప్రాంతంలో రెండుసార్లు అధికారులతో కలిసి తాను పర్యటించి అధ్యయనం చేశానని తెలిపారు. అన్ని శాఖలను సమన్వయంతో ఈ సమస్యను కొలిక్కి తెచ్చానని అన్నారు.


కేబినెట్‌లో పెట్టి 1,215 మందికి శాశ్వత పట్టాలకు ఆమోదం పొందామని పేర్కొన్నారు. 60 ఏళ్ళ సమస్య పరిష్కారం కావటంతో వాళ్ల ఆనందానికి అవధుల్లేవని అన్నారు. భగత్ సింగ్ కాలనీలో గతేడాది 1,407 మందికి శాశ్వత ఇంటి పట్టాలు ఇచ్చామని ఈ సందర్భంగా మంత్రి నారాయణ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గిరిజనుల సంక్షేమానికి పవన్ చేస్తోన్న యజ్ఞం ‘అడవితల్లి బాట 2.0’

ఏపీ రైతు బజార్లలో కిలో సన్నబియ్యం రూ.49కే.. కొత్తగా KNM రకం

For More AP News And Telugu News

Updated Date - Oct 11 , 2026 | 08:52 PM