నాలుగైదు రోజుల్లో ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన: టీ బీజేపీ చీఫ్
ABN , Publish Date - Oct 11 , 2026 | 08:20 PM
గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నాలుగైదు రోజుల్లో అభ్యర్థులను ప్రకటిస్తామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు తెలిపారు.
హైదరాబాద్, అక్టోబర్ 11: గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నాలుగైదు రోజుల్లో అభ్యర్థులను ప్రకటిస్తామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే తమ పార్టీ నేతలు ఓటర్ ఎన్‌రోల్‌మెంట్ ప్రక్రియపై పూర్తి ఫోకస్ పెట్టారని చెప్పారు. ఈ ఎన్నికల్లో తాను పోటీ చేయాలా? వద్దా? అనేది పార్టీ నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. పార్టీ ఆదేశాలకు కట్టుబడి ఉంటామని అన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి ఆశావాహుల పేర్లు ఇప్పటికే అధిష్ఠానానికి పంపించామని వివరించారు. తుది నిర్ణయం అధిష్ఠానానిదేనని టీ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు పేర్కొన్నారు.
అంతకుముందు తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు అధ్యక్షతన రాష్ట్ర బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ విజయవంతంగా 25 సంవత్సరాల ప్రజా పరిపాలనను పూర్తి చేసుకున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఈ భేటీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు లక్ష్మణ్, ఈటల రాజేందర్‌తోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. తెలంగాణలో రెండు గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఇద్దరు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. అలాగే బీఆర్ఎస్ కూడా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఇండిగో విమానంలో మంటలు.. శంషాబాద్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్