Share News

ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం రద్దు

ABN , Publish Date - Oct 11 , 2026 | 07:03 PM

పాకిస్థాన్‌లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ దేశ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ.. ఖైబర్ పఖ్తూంఖ్వా ప్రావిన్సులో ఇమ్రాన్ ప్రభుత్వాన్ని రద్దు చేశారు. అంతేకాకుండా అత్యవసర పరిస్థితి విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం  రద్దు

ఇంటర్‌నెట్ డెస్క్: పాకిస్థాన్‌లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ దేశ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ.. ఖైబర్ పఖ్తూంఖ్వా ప్రావిన్సులో ఇమ్రాన్ ప్రభుత్వాన్ని రద్దు చేశారు. అంతేకాకుండా అత్యవసర పరిస్థితి విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఖైబర్ పఖ్తూంఖ్వాలో పెరుగుతున్న ఉగ్రవాదం, క్షీణిస్తున్న శాంతిభద్రతల కారణంగా ఇమ్రాన్ ప్రభుత్వాన్ని రద్దు చేయాల్సి వచ్చిందని అధ్యక్షుడు పేర్కొన్నట్లు ఆ దేశ మీడియా తెలిపింది. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ఇమ్రాన్ ప్రభుత్వం విఫలమైందని ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ కార్యాలయం పేర్కొంది. ప్రధానమంత్రి సలహా మేరకు అత్యవసర ప్రకటనపై అధ్యక్షుడు సంతకం చేశారు. ఈ ప్రతిపాదనను ఫెడరల్ క్యాబినెట్ గతంలోనే ఆమోదించింది.


కాగా.. అత్యవసర నిర్ణయాన్ని ఖైబర్ పఖ్తూంఖ్వా గవర్నర్ ఫైసల్ కరీం కుండి స్వాగతించారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో శాంతిభద్రతలు నెలకొంటాయని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా అభివృద్ధి, ప్రజల సంక్షేమానికి మార్గం ఏర్పడుతుందన్నారు. ఉగ్రవాదంపై పోరులో భద్రతా సంస్థలకు అండగా నిలవాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోకూడదని సూచించారు. ఇస్లామిస్ట్ మిలిటెంట్లను కట్టడి చేయడంలో ఇమ్రాన్ ప్రభుత్వం విఫలమైందని పాక్ ఫెడరల్ ప్రభుత్వం, మిలిటరీ కూడా ఆరోపించాయి. ఇమ్రాన్ ప్రభుత్వ చేతకానితనం వల్ల గత కొద్ది నెలల్లో ఖైబర్ పఖ్తూంఖ్వాలో ఉగ్రవాద దాడులు పెరిగాయని, దీంతో ప్రజలు భారీ సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారని చెప్పాయి. అయితే, ఆరోపణలను పీటీఐ ఖండించింది. ఖైబర్ పఖ్తూంఖ్వాలో మిలిటెన్సీపై పోరాడడంలో ఫెడరల్ ప్రభుత్వం నిధులు ఇవ్వలేదని, దీంతో చాలినన్ని ఆయుధాలు సమకూర్చుకోలేకపోయామని పేర్కొంది.


ఈ వార్తలనూ చవండి:

రియాద్ విమానాశ్రయంపై దాడి.. సౌదీకి సాయం గురించి అమెరికా ఆలోచన..

రియాద్ విమానాశ్రయంపై క్షిపణి దాడి.. ఖండించిన భారత్

Updated Date - Oct 11 , 2026 | 08:03 PM