Share News

గిరిజనుల సంక్షేమానికి పవన్ చేస్తోన్న యజ్ఞం ‘అడవితల్లి బాట 2.0’

ABN , Publish Date - Oct 11 , 2026 | 06:28 PM

గిరిజనుల అభివృద్ధికై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేపట్టిన ‘అడవితల్లి బాట 2.0’ కార్యక్రమంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా ప్రశంసలు కురిపించారు. గిరిజనుల సంక్షేమానికి పవన్ చేస్తున్న కృషిని ఆయన కొనియాడారు.

గిరిజనుల సంక్షేమానికి పవన్ చేస్తోన్న యజ్ఞం ‘అడవితల్లి బాట 2.0’
CM Chandrababu on adavithalli bata 2.0

అమరావతి, అక్టోబర్ 11: రాష్ట్రంలోని గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేపట్టిన‘అడవితల్లి బాట 2.0’ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా స్పందించారు.


‘ఏపీలో గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించే లక్ష్యంతో ‘అడవితల్లి బాట 2.0’ కార్యక్రమాన్ని ఉపముఖ్యమంత్రి పవన్ ప్రారంభించారు. రూ.2,052 కోట్ల అంచనా వ్యయంతో 1,976 కిలోమీటర్ల మేర కొత్త రహదారుల నిర్మాణానికి ఈ కార్యక్రమం ద్వారా శ్రీకారం చుట్టారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మరో 1,341 గిరిజన ఆవాసాలు పక్కా రహదారులతో అనుసంధానం కానున్నాయి. గిరిజనుల దవాఖానా ప్రయాణ కష్టాలను దూరం చేస్తూ.. డోలీ మోతలకు స్వస్తి పలికేలా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ మహత్తర యజ్ఞాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. ఈ రహదారుల నిర్మాణం సౌకర్యార్థం మాత్రమే కాదని.. గిరిజనుల కష్టాలు, అత్యవసర వైద్య సేవల దృష్ట్యా ఇది గొప్ప భరోసా. ఈ మేరకు రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించే కూటమిని స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించాలి. గ్రామాల అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి’ అని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక కార్యాచరణ: పవన్ కల్యాణ్

తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ సిబ్బందికి ప్రమాదం

For More AP News And Telugu News

Updated Date - Oct 11 , 2026 | 06:30 PM