ఏపీ రైతు బజార్లలో కిలో సన్నబియ్యం రూ.49కే.. కొత్తగా KNM రకం
ABN , Publish Date - Oct 11 , 2026 | 06:12 PM
ఆంధ్రప్రదేశ్‌లో సామాన్య ప్రజలకు తక్కువ ధరకు నాణ్యమైన సన్నబియ్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ చర్యలు చేపట్టింది. వివరాల్లోకి వెళితే..
అమరావతి, అక్టోబర్ 11: ఆంధ్రప్రదేశ్‌లో సామాన్య ప్రజలకు తక్కువ ధరకు నాణ్యమైన సన్నబియ్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రైతు బజార్లలో కిలో సన్నబియ్యాన్ని రూ.49కే విక్రయించనున్నారు. ఇప్పటికే రైతు బజార్లలో అందుబాటులో ఉన్న బీపీటీ (BPT) రకం బియ్యంతో పాటు, ఇకపై కేఎన్‌ఎం (KNM) రకం సన్నబియ్యాన్ని కూడా విక్రయించనున్నారు. ఈ నిర్ణయంతో తక్కువ ధరకు నాణ్యమైన బియ్యం కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులకు ప్రయోజనం కలగనుంది. బహిరంగ మార్కెట్‌లో బియ్యం ధరల నేపథ్యంలో రైతు బజార్ల ద్వారా సరసమైన ధరలకు బియ్యం అందించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది.
విజయవాడలోని భవానీపురం రైతు బజార్‌లో ఆదివారం ఉదయం 10.30 గంటలకు కేఎన్‌ఎం రకం సన్నబియ్యం విక్రయాల కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి, కిలో రూ.49 చొప్పున బియ్యాన్ని విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బీపీటీతో పాటు కేఎన్‌ఎం రకం బియ్యం అందుబాటులోకి రావడంతో వినియోగదారులకు మరిన్ని ఎంపికలు లభించనున్నాయి. ప్రజలకు నాణ్యమైన సన్నబియ్యాన్ని అందుబాటు ధరల్లో అందించడమే లక్ష్యంగా పౌరసరఫరాల శాఖ ఈ చర్యలు చేపడుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి:
లోక కల్యాణం కోసం నిత్య పెళ్లికొడుకుగా...
అధికమాసం...నవరాత్రి బ్రహ్మోత్సవాలివి...
Read Latest AP News And Telangana News And International News And Telugu News