NVS-03 ప్రయోగం.. భారత నావిగేషన్ వ్యవస్థకు మరింత బలం: ఇస్రో ఛైర్మన్
ABN , Publish Date - Oct 29 , 2026 | 03:41 PM
NVS-03 ఉపగ్రహ ప్రయోగం.. భారత నావిగేషన్ వ్యవస్థకు మరింత బలమని ఇస్రో ఛైర్మన్ , డాక్టర్ . నారాయణన్ వ్యాఖ్యానించారు. నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట గ్రామ దేవత శ్రీ చెంగాళమ్మను గురువారం నారాయణన్ దర్శించుకున్నారు.
నెల్లూరు జిల్లా, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): NVS-03 ఉపగ్రహ ప్రయోగం.. భారత నావిగేషన్ వ్యవస్థకు మరింత బలమని ఇస్రో ఛైర్మన్, డాక్టర్. నారాయణన్ వ్యాఖ్యానించారు. నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట గ్రామ దేవత శ్రీ చెంగాళమ్మను ఈరోజు (గురువారం) నారాయణన్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. రేపు (గురువారం) రాత్రికి షార్‌లో ప్రయోగించే Gslv-F 18 రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని అమ్మవారికి పూజలు చేశానని తెలిపారు.
ఈ ప్రయోగానికి 24 గంటల ముందు కౌంట్‌డౌన్ ప్రారంభమైందని నారాయణన్ వెల్లడించారు. రేపు రాత్రి 11:51 గంటలకు రాకెట్‌ను నింగిలోకి ప్రయోగిస్తామని వివరించారు. ఈ ప్రయోగం ద్వారా NVS-03 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెడుతున్నామని చెప్పుకొచ్చారు. ఇస్రో మరికొద్ది రోజుల వ్యవధిలోనే గగన్ యాన్ D1 ప్రయోగం చేపడుతుందని అన్నారు. రాబోయే రోజుల్లో ప్రైవేట్ లాంచింగ్‌లకు ఇస్రో ప్రాధాన్యం ఇవ్వనుందని వివరించారు. ఇది నావిగేషన్ వ్యవస్థలో NVS - 03 ఐదో ఉపగ్రహమని చెప్పారు. భారతదేశానికి నావిగేషన్ వ్యవస్థ మెరుగుపరిచేందుకే ఈ ప్రయోగం ఉపయోగపడుతుందని వెల్లడించారు. ఇస్రో రాబోయే రోజుల్లో మరింత వేగంగా ప్రయోగాలు చేసేందుకు సన్నాహాలు చేస్తోందని నారాయణన్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆర్నబ్ తుఫాన్ బాధితులకు సీఎం చంద్రబాబు భారీ ఊరట
ఆర్నబ్ తుఫాన్ నష్టంపై సమగ్ర అంచనా వేయండి.. అధికారులకు సీఎం ఆదేశం
ఆర్నబ్ తుఫాన్ బాధితులకు పూర్తి అండగా ఉంటాం: హోం మంత్రి అనిత
Read Latest AP News And Telangana News And National News
And Telugu News