నెల్లూరు జిల్లాలో పోలీసులపై బరితెగించి అనుచిత వ్యాఖ్యలు చేసిన మేకపాటి
ABN , Publish Date - Nov 07 , 2026 | 08:42 PM
నెల్లూరు జిల్లా ఆత్మకూరులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఎలాంటి అనుమతులు లేకుండా కౌంటింగ్ హాల్ లోకి మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి చొరపడేందుకు ప్రయత్నించారు. ఈక్రమంలో ఆయనను అడ్డుకున్న పోలీసులపై అనుచిత వ్యాఖ్యలతో రెచ్చిపోయారు.
నెల్లూరు జిల్లా, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): నెల్లూరు జిల్లా ఆత్మకూరులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఎలాంటి అనుమతులు లేకుండా కౌంటింగ్ హాల్లోకి మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి చొరబడేందుకు ప్రయత్నించారు. ఈక్రమంలో ఆయనను అడ్డుకున్న పోలీసులపై అనుచిత వ్యాఖ్యలతో రెచ్చిపోయారు. పోలీసు అధికారులపై దౌర్జన్యం చేస్తూ తీవ్ర బెదిరింపులకు దిగారు.
కౌంటింగ్ హాలు వద్ద వైసీపీ రౌడీ మూకలతో మేకపాటి హల్‌చల్ చేశారు. ఎన్నికల అధికారులు రమ్మన్నారంటూ పోలీసులతో బుకాయించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద నుంచి తిరిగి వెళ్లి, మరోసారి కౌంటింగ్ హాల్ వద్దకు మేకపాటి బయలుదేరారు. ఈ నేపథ్యంలో ఆయనను మధ్యలోనే పోలీసులు అడ్డుకున్నారు. మేకపాటిని అదుపులోకి తీసుకుని, ఆయనను ఇంటికి తరలించారు. అయితే, ఆత్మకూరు నియోజకవర్గంలో 6 జడ్పీస్థానాలను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
తుఫాన్ బాధితులకు అండగా ఉంటాం.. అధైర్యపడొద్దు: సీఎం చంద్రబాబు
ఏపీ విపత్తు నిర్వహణ భేష్.. ప్రభుత్వ పనితీరుపై కేంద్రం ప్రశంసలు
పదే పదే అవమానించడంతోనే వైసీపీ నుంచి బయటకు వచ్చా: విజయసాయిరెడ్డి
Read Latest Telangana News And AP News And National News
And Telugu News