మంత్రి నారాయణను సన్మానించిన క్రెడాయ్ ఏపీ ప్రతినిధులు
ABN , Publish Date - Aug 04 , 2026 | 03:56 PM
మంత్రి నారాయణను క్రెడాయ్ ఏపీ ప్రతినిధులు మంగళవారం కలిశారు. మంత్రికి అభినందనలు తెలిపి సన్మానించారు.
అమరావతి, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): మంత్రి నారాయణను క్రెడాయ్ ఏపీ ప్రతినిధులు ఈరోజు (మంగళవారం) కలిశారు. మంత్రికి అభినందనలు తెలిపి సన్మానించారు. భవన నిర్మాణ అనుమతుల్లో నిబంధనలు సులభతరం చేస్తూ ఇటీవల జీవో నంబర్161 జారీ చేసిన విషయం తెలిసిందే. మునిసిపల్ శాఖ నిబంధనలు సరళతరం చేయడంలో కీలకంగా వ్యవహరించినందుకు మంత్రి నారాయణను అభినందించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగానికి ఎంతో ఊపు వచ్చిందని తెలిపారు.
డిక్లరేషన్ విధానం నుంచి సెట్ బ్యాక్‌ల తగ్గింపు వరకూ ప్రభుత్వం ఎంతో మేలు చేసిందని క్రెడాయ్ ఏపీ ప్రతినిధులు వెల్లడించారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ వల్లే రియల్ ఎస్టేట్ పరిశ్రమ వృద్ధి చెందిందని కొనియాడారు. తిరుపతి, రాజమండ్రిలో త్వరలో నిర్వహించే క్రెడాయ్ ఎక్స్‌పోకు ముఖ్యఅతిథిగా హాజరుకావాలని మంత్రికి ఆహ్వానం పలికారు. కాకినాడ అర్బన్ డెవలప్‌మెంట్ అధారిటీ మాస్టర్ ప్లాన్‌ను త్వరగా ఫైనలైజ్ చేయాలని క్రెడాయ్ ఏపీ ప్రతినిధులు కోరారు. మంత్రిని కలిసిన వారిలో క్రెడాయ్ ఏపీ చైర్మన్ బుడ్డిగ శ్రీనివాసు, జనరల్ సెక్రటరీ దాసరి రాంబాబు, ఇతర ప్రతినిధులు ఉన్నారు.
వార్తలు కూడా చదవండి...
డేటా ఆధారిత పాలనకు ప్రాధాన్యం ఇవ్వాలి: సీఎం చంద్రబాబు
కామన్వెల్త్ గేమ్స్ అద్భుతంగా ముగిశాయి: పవన్ కల్యాణ్
అభివృద్ధి కార్యక్రమాలు జగన్‌కు నచ్చవు: ఎంపీ కలిశెట్టి
Read Latest Telangana News And AP News And National News
And Telugu News