ఆత్మకూరు మున్సిపల్ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకం: మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
ABN , Publish Date - Oct 17 , 2026 | 04:00 PM
మున్సిపాలిటీ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేసే కూటమి పార్టీ అభ్యర్థులతో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమావేశమయ్యారు. ఆత్మకూరు మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నామని చెప్పారు.
నెల్లూరు, అక్టోబర్ 17: మున్సిపాలిటీ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేసే కూటమి పార్టీ అభ్యర్థులతో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమావేశమయ్యారు. ఈరోజు(శనివారం) ఆత్మకూరు పట్టణంలో టీడీపీ పార్టీ కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం కూటమి అభ్యర్థులతో సమావేశమై మున్సిపల్ ఎన్నికలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ఆత్మకూరు మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నామని చెప్పారు. ఆత్మకూరు మున్సిపాలిటీకి కోట్లాది రూపాయల నిధులు కేటాయించామని అన్నారు. ఐదేళ్లలో జరిగిన అభివృద్ధి కంటే రెండేళ్లలో ఆత్మకూరులో జరిగిన అభివృద్ధిని ప్రజలు గమనించాలని తెలిపారు.
ఆత్మకూరు అభివృద్ధిని వైసీపీ నాయకులు అడ్డుకున్నారని మంత్రి ఆరోపించారు. గతంలో వైసీపీ నేతలు ఆత్మకూరుకు చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ నాయకులు వ్యక్తిగత స్వార్థంతో పాలనను అస్తవ్యస్తం చేశారని మండిపడ్డారు. అపరిష్కృతంగా ఉన్న సమస్యలన్నింటినీ కూటమి ప్రభుత్వం పరిష్కరిస్తోందన్నారు. ఆత్మకూరును అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యమని స్పష్టం చేశారు. అధిష్ఠానం నిర్ణయం మేరకు ఆత్మకూరు మున్సిపాలిటీ చైర్ పర్సన్ అభ్యర్థిని ప్రకటిస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
‘విచారణ పూర్తయ్యే వరకు రాజకీయాలకు దూరంగా ఉండాలి’.. జగన్ కేసులపై సోమిరెడ్డి
చిత్తూరులో ప్రశాంతంగా నామినేషన్లు.. మదనపల్లెలో స్నేహపూర్వక వాతావరణం
Read Latest AP News And Telugu News