నెల్లూరులో నామినేషన్ల సందడి.. కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై సందిగ్ధత
ABN , Publish Date - Oct 17 , 2026 | 03:37 PM
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం జోరుగా సాగుతోంది. నెల్లూరు మేయర్ స్థానానికి టీడీపీ అభ్యర్థి రూప్ కుమార్, వైసీపీ అభ్యర్థి ఆనం విజయకుమార్ రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు.
Nellore Municipal Elections: ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం అత్యంత కోలాహలంగా కొనసాగుతోంది. నెల్లూరుతో పాటు బుచ్చిరెడ్డిపాలెం, ఆత్మకూరు, నాయుడుపేట, సూళ్లూరుపేట, వెంకటగిరి మున్సిపాలిటీలలో అభ్యర్థులు పెద్ద ఎత్తున తరలివచ్చి నామినేషన్లు దాఖలు చేశారు.
ప్రధాన అభ్యర్థుల నామినేషన్లు
నెల్లూరు మేయర్ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా రూప్ కుమార్, వైసీపీ అభ్యర్థిగా ఆనం విజయకుమార్ రెడ్డి నామినేషన్లు సమర్పించారు. కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు, పొత్తులు ఇంకా పూర్తిగా కొలిక్కి రాలేదు. దీంతో 72 డివిజన్లలో మూడు కూటమి పార్టీల నుంచి అభ్యర్థులు ఎవరికివారుగా నామినేషన్లు దాఖలు చేశారు. అయితే మిగిలిన చోట్ల మాత్రం మూడు పార్టీలు కలిసికట్టుగా సీట్ల పంపకాలు జరుపుకుని ముందుకు సాగుతున్నాయి.
నెల్లూరులో వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని టీడీపీ మేయర్ అభ్యర్థి రూప్ కుమార్ తెలిపారు. మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిల సమిష్టి కృషితో సిటీ, రూరల్ లోని అన్ని డివిజన్లను భారీ మెజార్టీతో గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
ఎన్నికల కోసం యుద్ధం చేయాల్సిన పరిస్థితిని టీడీపీ నేతలు కల్పిస్తున్నారని వైసీపీ అభ్యర్థి ఆనం విజయకుమార్ రెడ్డి మండిపడ్డారు. తమ ఆనం కుటుంబం ఎప్పుడూ డబ్బున్నోళ్లతోనే పోటీ పడిందని, అయితే ప్రస్తుతం పోలీసులు, ప్రభుత్వ అధికారులు తమ పార్టీ అభ్యర్థులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారని ఆయన ఆరోపించారు.
ఈ వార్తలూ చదవండి
రైతులకు మహారాష్ట్ర ఐఏఎస్, ఐపీఎస్ల అండ.. సహాయనిధికి ఒక్కరోజు జీతం.
‘ఫుట్పాత్ ఏర్పాటు చేయకపోతే ధర్నాకు దిగుతాం’.. సుప్రీంకోర్టు హెచ్చరిక