చిత్తూరులో ప్రశాంతంగా నామినేషన్లు.. మదనపల్లెలో స్నేహపూర్వక వాతావరణం
ABN , Publish Date - Oct 17 , 2026 | 03:33 PM
ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా రెండో రోజు మున్సిపల్, కార్పోరేషన్ నామినేషన్ల ఘట్టం ప్రశాంతంగా ముగిసింది. నిన్న పుంగనూరులో చోటుచేసుకున్న ఘటనల నేపథ్యంలో రెండో రోజు నామినేషన్లు ఎలాంటి ఆందోళనలు లేకుండా ముగియడంతో పోలీసులు, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.
చిత్తూరు, అక్టోబర్ 17: ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా రెండో రోజు మున్సిపల్, కార్పోరేషన్ నామినేషన్ల ఘట్టం ప్రశాంతంగా ముగిసింది. నిన్న పుంగనూరులో చోటుచేసుకున్న ఘటనల నేపథ్యంలో రెండో రోజు నామినేషన్లు ఎలాంటి ఆందోళనలు లేకుండా ముగియడంతో పోలీసులు, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. అయితే పుంగనూరులో చివరి నిమిషంలో నామినేషన్ కేంద్రం వద్దకు భారీ ఎత్తున జనం చేరుకోవడంతో పోలీసులు కొంత ఆందోళనకు గురైనట్లు తెలుస్తోంది. చివరకు ఎలాంటి ఘర్షణలు జరగకపోవడంతో పోలీసులు కూడా హమ్మయ్య అనుకున్న పరిస్థితి.
తొలిరోజు నామినేషన్ సందర్భంగా నిన్న(శుక్రవారం) పుంగనూరులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. నామినేషన్లు వేసేందుకు వచ్చిన టీడీపీ నేతలపై వైసీపీ శ్రేణులు దాడులకు యత్నించడంతో పుంగనూరులో భయానక వాతావరణం నెలకొంది. ఇరుపార్టీలు పరస్పరం దాడులకు పాల్పడటంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు లాఠీఛార్జ్ చేసి చెదరగొట్టారు. అనంతరం నామినేషన్లు కొనసాగాయి. నిన్నటి ఘటనలు పునారావృతం కాకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. నామినేషన్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. దీంతో ఆయా పార్టీల అభ్యర్థులు ప్రశాంతమైన వాతావరణంలో నామినేషన్లు దాఖలు చేశారు.
మదనపల్లి నామినేషన్ కేంద్రం వద్ద సహృదయ వాతావరణం
మదనపల్లి నామినేషన్ కేంద్రం వద్ద సహృదయ వాతావరణం కనిపించింది. టీడీపీ చైర్మన్ అభ్యర్థి శ్రీరామ చిన్నబాబు, వైసీపీ చైర్మన్ అభ్యర్థి జింక వెంకట చలపతి చేతులు కలిపి ఒకే చోట నామినేషన్ దాఖలు చేశారు. స్నేహపూర్వక వాతావరణంలో ఎన్నికలను నిర్వహించుకుందాం అంటూ అభ్యర్థులు ఒకరినొకరు పలకరించుకున్నారు. షేక్ హ్యాండ్ ఇస్తూ కార్యకర్తలకు శాంతి సూచన పంపించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మదనపల్లెలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
ఇవి కూడా చదవండి..
పుంగనూరులో వైసీపీ దాడులపై బోండా ఉమ ఫైర్.. మిథున్ రెడ్డి అరెస్ట్కు డిమాండ్
‘విచారణ పూర్తయ్యే వరకు రాజకీయాలకు దూరంగా ఉండాలి’.. జగన్ కేసులపై సోమిరెడ్డి
Read Latest AP News And Telugu News