Share News

నంద్యాల జిల్లాలో లారీని ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు

ABN , Publish Date - May 17 , 2026 | 09:00 AM

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని మిగిల్చింది. లారీని ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో జై భారత్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి లారీని ఢీకొట్టింది.

నంద్యాల జిల్లాలో లారీని ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
Nandyal Road Accident

నంద్యాల జిల్లా, మే 17 (ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని మిగిల్చింది. లారీని ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో జై భారత్ (JBT) ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ ప్రయాణికుడు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అరుణాచలం నుంచి హైదరాబాద్‌కు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బయలు దేరింది. ఈ బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు ఉన్నారు. నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డ సమీపంలో నిదానంగా వెళ్తున్న బొగ్గు లారీని ఓవర్‌టేక్ చేసే క్రమంలో బస్సు ఢీకొంది. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో చిత్తూరు జిల్లా సుగంకు చెందిన సుబ్రహ్మణ్యం (50) ప్రయాణికుడు మృతిచెందారు. మృతదేహాన్ని ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమా? లేక ఇతర సాంకేతిక సమస్యలేమైనా ఉన్నాయా? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు.


తూర్పుగోదావరి జిల్లాలో..

మరో ఘటనలో.. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, ఓ వ్యాన్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో వ్యాన్‌డ్రైవర్ మృతిచెందగా, మరొకరికి గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి గోపాలపురం పోలీసులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ఏఎంసీఏ ప్రాజెక్టు రాయలసీమ అభివృద్ధిలో కీలక మైలురాయి: సీఎం చంద్రబాబు

ఫ్యాక్షన్ రాజకీయాలు తట్టుకుని ఇక్కడివరకొచ్చా.. జగన్ అండ్‌కోకు పవన్ స్ట్రాంగ్ కౌంటర్

విజయవాడ జీజీహెచ్ ఘటనపై మంత్రి సత్యకుమార్ సీరియస్

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 17 , 2026 | 09:16 AM