Share News

నంద్యాల జిల్లాలో భార్యపై బాణంతో దాడికి యత్నం

ABN , Publish Date - Jun 29 , 2026 | 07:53 AM

నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు మండలం బైర్లూటి గూడెంలో కుటుంబ కలహాల నేపథ్యంలో తన భార్యపై భర్త పులిచెర్ల వెంకటేశ్వర్లు బాణంతో దాడి చేయడానికి యత్నించాడు. ఈ క్రమంలో అడ్డుకునేందుకు వచ్చిన అత్త గుళ్ల కోటమ్మ తీవ్రంగా గాయపడింది.

నంద్యాల జిల్లాలో భార్యపై బాణంతో దాడికి యత్నం
Nandyal rrow Attack

నంద్యాల జిల్లా, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు మండలం బైర్లూటి గూడెంలో కుటుంబ కలహాల నేపథ్యంలో తన భార్యపై భర్త పులిచెర్ల వెంకటేశ్వర్లు బాణంతో దాడి చేయడానికి యత్నించాడు. ఈ క్రమంలో అడ్డుకునేందుకు వచ్చిన అత్త గుళ్ల కోటమ్మ తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బైర్లూటి గూడెంకు చెందిన పులిచెర్ల వెంకటేశ్వర్లు మద్యం మత్తులో ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులతో గొడవపడ్డాడు. ఇటీవల అతని రెండు నెలల కుమారుడు అనారోగ్యంతో మృతిచెందడంతో కుటుంబంలో విషాద వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో మద్యం మత్తులో వెంకటేశ్వర్లు తన భార్యపై బాణంతో దాడి చేసేందుకు ప్రయత్నించాడు. అయితే కూతురిని రక్షించేందుకు అడ్డుగా వచ్చిన ఆమె తల్లి గుళ్ల కోటమ్మపై బాణం బలంగా దూసుకెళ్లింది.


కోటమ్మ కాలిలోకి బాణం దిగడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు వెంటనే స్పందించి బాధితురాలిని సమీప ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో గుళ్ల కోటమ్మ చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బాధితుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు. దాడికి దారితీసిన పరిస్థితులు, కుటుంబ విభేదాలు, ఇతర కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ఐదేళ్లలోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించండి: అనిత

ట్రంప్, పుతిన్‌లకు కూడా ఫిర్యాదు చేయండి.. నానిపై శివనాథ్ సెటైర్లు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jun 29 , 2026 | 08:02 AM