ఓటువేసి రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కండి: ఎంపీ కేశినేని శివనాథ్
ABN , Publish Date - Nov 01 , 2026 | 10:19 AM
మున్సిపల్ ఎన్నికల కోసం అధికారులు బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశారని.. ఉదయం 7 గంటల నుంచి విజయవాడలో ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతోందని ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. ఓటుహక్కు గల వారందరూ తమ హక్కును వినియోగించుకుని.. విజయవాడ అభివృద్ధికి పాటుపడాలని ఎంపీ కోరారు.
విజయవాడ, నవంబర్ 1: ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఈ రోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఈ మేరకు అర్హత కలిగిన వారందరూ.. ఓటు వేసి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో విజయవాడలో ప్రశాంతంగా పోలింగ్ నమోదు అవుతూందన్నారు.
‘ఉదయం 7 గంటల నుంచి విజయవాడలో ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. అధికారులు బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశారు. వృద్ధులకు ప్రత్యేకంగా వీల్ చైర్లు ఏర్పాటు చేశారు. పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 5 గంటల లోపు కొనసాగుతుంది. ఈ లోపు అర్హత గల వారందరూ తమ ఓటుహక్కును వినియోగించుకోండి. విజయవాడలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇప్పుడు పెద్దవాళ్ళందరూ ఓటు వేయడానికి వస్తున్నారు. జెన్ జీ యువత కొంచెం లేట్‌గా వస్తారు. ముందుగా పెద్దవారు రావడం శుభదాయకం. గత అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధమైన పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ పడిందో.. అదే విధంగా ఇప్పుడూ ఓటింగ్ రావాలని కోరుకుంటున్నాం’ అని ఎంపీ కేశినేని పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్థిరంగా కొనసాగుతున్న వెండి ధర..
ఏపీలో మున్సిపల్ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్.