Share News

డ్రగ్స్ రవాణాపై పంజా విసిరిన విజయవాడ పోలీసులు.. 110 గ్రాముల డ్రగ్స్ స్వాధీనం

ABN , Publish Date - Oct 14 , 2026 | 02:23 PM

డ్రగ్స్ రవాణాపై విజయవాడ పోలీసులు పంజా విసిరారు. నిషేధిత మాదకద్రవ్యాల రవాణాపై ఆపరేషన్ నిర్వహించి 110 గ్రాముల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

డ్రగ్స్ రవాణాపై పంజా విసిరిన విజయవాడ పోలీసులు.. 110 గ్రాముల డ్రగ్స్ స్వాధీనం
vijayawada drug seizure

విజయవాడ, అక్టోబర్ 14: జిల్లాలో విచ్చలవిడిగా జరుగుతున్న డ్రగ్స్ విక్రయాలపై విజయవాడ పోలీసులు పంజా విసిరారు.


డ్రగ్స్ రవాణా, విక్రయాలపై సమాచారం అందుకున్న విజయవాడ ఈగల్, జీఆర్‌పీ సిబ్బంది జాయింట్ ఆపరేషన్ నిర్వహించి డ్రగ్స్ రవాణా గుట్టును రట్టు చేశారు. ఈ క్రమంలో ఓ యువతి నుంచి 110 గ్రాముల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకుని, ఆమెను అదుపులోకి తీసుకున్నారు. యువతికి డ్రగ్స్ ఎలా లభ్యమయ్యాయి అనే కోణంలో పోలీసులు విచారణ చేయగా.. బెంగుళూరు నుంచి డ్రగ్స్‌ను రైలులో విజయవాడకు తీసుకువచ్చి.. విక్రయాలు జరుపుతున్నట్లు వారు గుర్తించారు. ఈ మేరకు ఈ డ్రగ్స్ దందాలో ఇంకా ఎవరెవరు ఉన్నారు.. అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి:

ఎయిర్ ఇండియా విమానానికి హైజాక్ హెచ్చరిక..

సీజేపీ నేతలను జైలుకు పంపడం పిరికిపంద చర్య

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 14 , 2026 | 02:24 PM