Share News

విజయవాడలో దసరా ఉత్సవాలు.. భద్రతను సమీక్షించిన హోం మంత్రి

ABN , Publish Date - Oct 12 , 2026 | 04:21 PM

విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో శరన్నవరాత్రుల ఉత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నవరాత్రుల్లో దుర్గమ్మవారిని దర్శించుకునేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పోటెత్తుతున్నారు.

విజయవాడలో దసరా ఉత్సవాలు.. భద్రతను సమీక్షించిన హోం మంత్రి

విజయవాడ, అక్టోబర్12: నగరంలో ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో శరన్నవరాత్రుల ఉత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నవరాత్రుల్లో దుర్గమ్మవారిని దర్శించుకునేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పోటెత్తుతున్నారు. విజయవాడ వేదికగా ఈ దసరా ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ్ 2.0తోపాటు జాతీయ సరస్ మేళా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై పోలీస్ అధికారులతో రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత సోమవారం సమీక్షించారు.


ఈ సందర్భంగా విజయవాడ మోడల్ గెస్ట్ హౌస్‌లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్‌ను హోం మంత్రి సందర్శించారు. ఈ కంట్రోల్ రూమ్‌ పనితీరును మంత్రికి వారు వివరించారు. భక్తుల భద్రతకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 30 అధునాతన డ్యాష్‌ బోర్డుల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేస్తున్నట్లు చెప్పారు.


అలాగే భక్తుల రద్దీని పర్యవేక్షించేందుకు ఏఐ కెమెరాలు, డ్రోన్లు, ఏఎన్‌పీఆర్ సాంకేతికతను వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. దేవాలయంలో క్యూ లైన్లు, పార్కింగ్ ప్రదేశాలు, ఆర్టీసీ, రైల్వే ప్రయాణికుల రద్దీపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు వివరించారు. భక్తుల సౌకర్యార్థం నగరంలో 40 పార్కింగ్ పాయింట్లు ఏర్పాటు చేశామని మంత్రి అనితకు పోలీస్ అధికారులు తెలిపారు. ఈ సమీక్షలో డీసీపీలు షీరీన్ బేగం, కేజీవీ సరిత, కృష్ణ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బీసీ యువతకు ఉచిత సివిల్స్ కోచింగ్.. డా. లక్ష్మయ్య ఐఏఎస్ అకాడమీతో ఎంఓయూ

ఫార్ములా ఈ-కార్ రేస్ కేసు.. ఏసీబీ కోర్టులో కేటీఆర్ డిశ్చార్జ్ పిటిషన్

For More AP News And Telugu News

Updated Date - Oct 12 , 2026 | 04:36 PM