ఉయ్యూరు మున్సిపాలిటీ టీడీపీ కైవసం.. శ్రేణుల సంబరాలు
ABN , Publish Date - Nov 03 , 2026 | 04:06 PM
ఉయ్యూరు మున్సిపాలిటీని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. టీడీపీ గెలుపుపై ఉయ్యూరులో పార్టీ శ్రేణుల సంబరాలు అంబరాన్ని అంటాయి. ఆ పార్టీ కార్యాలయం వద్ద నేతలు, కార్యకర్తలు భారీగా సంబరాలు చేసుకున్నారు.
కృష్ణాజిల్లా (కంకిపాడు), నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): ఉయ్యూరు మున్సిపాలిటీని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. టీడీపీ గెలుపుపై ఉయ్యూరులో పార్టీ శ్రేణుల సంబరాలు అంబరాన్ని అంటాయి. ఆ పార్టీ కార్యాలయం వద్ద నేతలు, కార్యకర్తలు భారీగా సంబరాలు చేసుకున్నారు. స్వీట్స్ పంచుతూ ఎమ్మెల్యే బోడె ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడె ప్రసాద్ మాట్లాడారు.
కృష్ణానది నీటిని ఉయ్యూరు ప్రజలకు అందిస్తాం..
2024 జనరల్ ఎలక్షన్ల కన్నా అతిపెద్ద విజయాన్ని ఉయ్యూరు మున్సిపాలిటీ అందించిందని ఎమ్మెల్యే బోడె ప్రసాద్ వ్యాఖ్యానించారు. ఎన్నికల అప్పుడు ఏదైతే చెప్పామో చేసి చూపిస్తామని మాటిచ్చారు. టిడ్కో గృహాలు, కృష్ణానది నీటిని త్వరలోనే ఉయ్యూరు ప్రజలకు అందిస్తామని చెప్పారు. 98% స్ట్రైక్ రేట్ ఇచ్చిన ఉయ్యూరు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వంలో రెండున్నరేళ్ల నుంచి చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ప్రజలు భారీ మెజారిటీని తమకు ఇచ్చారని పేర్కొన్నారు.
వైసీపీకి పూర్తి సినిమా చూపిస్తాం..
నియోజకవర్గ పరిధిలోని తాడిగడప, ఉయ్యూరు మున్సిపాలిటీల్లో వైసీపీ ఒకటి గెలిచినా తాను రాజీనామాకు సిద్ధమని చెప్పా. కానీ తన సవాల్‌ను వైసీపీ ఇన్‌ఛార్జ్ చక్రవర్తి స్వీకరించలేదంటే .. ఓటమిని ముందే ఆయన అంగీకరించారని అర్థమవుతోందని అన్నారు. వైసీపీకి ఉయ్యూరు మున్సిపాలిటీతో ట్రైలర్ చూపించామని.. తాడిగడప మున్సిపాలిటీతో పూర్తి సినిమా చూపిస్తామని ఎమ్మెల్యే బోడె ప్రసాద్ స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మురసు తుఫాన్ ఎఫెక్ట్.. 29 రైళ్లపై దక్షిణ మధ్య రైల్వే నియంత్రణ
తుఫాన్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష.. వర్షపాతం లోటు తగ్గిందన్న అధికారులు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News