ఆ ఆలయ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తా: ఎంపీ శివనాథ్
ABN , Publish Date - Aug 26 , 2026 | 01:17 PM
విజయవాడలోని పాత శివాలయానికి విజయవాడలో ఎంతో ప్రాముఖ్యం ఉందని ఎంపీ శివనాథ్ తెలిపారు. ఈ ఆలయ అభివృద్ధికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని వ్యాఖ్యానించారు.
విజయవాడ, ఆగస్టు26 (ఆంధ్రజ్యోతి): శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం (పాత శివాలయం) నూతన ధర్మకర్తల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈరోజు ( బుధవారం) జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), తెలుగుదేశం పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జ్ బుద్ధా వెంకన్న, నాగుల్ మీరా, జనసేన పార్టీ నాయకులు అమ్మిశెట్టి వాసు, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ పాల్గొన్నారు.
పాత శివాలయానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది..
ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడారు. విజయవాడలోని పాత శివాలయానికి ఎంతో ప్రాముఖ్యం ఉందని తెలిపారు. ఈ ఆలయ అభివృద్ధికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని వ్యాఖ్యానించారు. ఈ ఆలయం వచ్చిన తర్వాతనే విజయవాడ అభివృద్ధి చెందడం ప్రారంభమైందని ప్రస్తావించారు. ఈ ప్రసిద్ధిగాంచిన ఆలయానికి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు ధర్మకర్తల మండలి ఏర్పాటు చేయాలని సూచించారు. నూతన ధర్మకర్తల మండలి చైర్మన్, సభ్యులకు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
ఆటోనగర్ ఐలా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావడం చాలా ఆనందంగా ఉంది: ఎంపీ కేశినేని శివనాథ్
అనంతరం విజయవాడ ఆటోనగర్ ఐలా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ సభలో ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, బుద్దా వెంకన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడారు. ఆటోనగర్ ఐలా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. సుమారు లక్ష మంది కార్మికులు నివసించే ఈ ప్రాంతంలో ఐలా చాలా ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంటుందని చెప్పారు. గత ఐలా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆటోనగర్‌లో ఎన్నో కార్యక్రమాలు జరిగాయని వెల్లడించారు. గత రెండు సంవత్సరాల నుంచి ఐలా ఎలక్షన్స్ పెట్టాలని చెప్పి, అధికారంలోకి వచ్చాక ప్రతి నిత్యం పోరాడటం జరిగిందని చెప్పారు. కలెక్షన్స్ 60 శాతం దాటితేనే ఐలా ఎలక్షన్లు ఉంటాయని అధికారులు చెప్పడంతో, ఇప్పుడు అందరూ కూడా కలిసికట్టుగా ఉండి, కలెక్షన్స్ 60శాతం దాటించి ఎలక్షన్ కండక్ట్ చేసుకున్నారని తెలిపారు.
ఆ సమస్యలను ఐలానే పరిష్కరించాలి..
శాంతియుతంగా, ప్రశాంతంగా జరిగిన ఈ ఎలక్షన్లలో విజయం సాధించిన ప్రతి ఒక్కరికీ అభినందనలు ఎంపీ శివనాథ్ చెప్పారు. ప్రెసిడెంట్: శివనాగేశ్వరరావు, వైస్ చైర్మన్: దుర్గాప్రసాద్, జనరల్ సెక్రటరీ: కలామ్, కార్యవర్గ సభ్యులు ఈ ఎలక్షన్లలో గెలిచిన వారందరికి కొన్ని సూచనలు చేస్తున్నానని అన్నారు. విజయవాడకే జీవనాడి ఆటోనగర్ అని తెలిపారు. ఈ జీవనాడి అయిన ఆటోనగర్‌లో రోడ్లు గానీ, డ్రైనేజీలు గానీ, మంచినీటి సమస్య గానీ ఏది ఉన్నా సరే.. ఐలానే పరిష్కరించాలని అన్నారు. ప్రజాప్రతినిధులందరం కూడా ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకొస్తే తప్పకుండా పరిష్కరిస్తామని చెప్పారు.
CRDAలో పోరాడి 3 రోడ్ల టెండర్లు పూర్తి చేశామని, ఇప్పటికే పనులు జరుగుతున్నాయని ఎంపీ శివనాథ్ వెల్లడించారు. 4వ రోడ్డు గద్దె రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో ప్రారంభించారని చెప్పారు. శక్తి కళ్యాణ మంటపం రోడ్డు కూడా రెడీ అయ్యిందని తెలిపారు. 24 గంటలు వాహనాలు ఆటోనగర్‌కి వచ్చి, విజయవాడకి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉండే విధంగా తామందరం కృషి చేస్తామని చెప్పారు. రాబోయే కాలంలో ఐలా మరింత విస్తృతంగా అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. లక్ష మంది కార్మికులకు దిశా నిర్దేశం చేసే విధంగా ఉండాలని ఎంపీ శివనాథ్ కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి...
పైలట్ల డోప్ టెస్టులపై కేంద్రం ఫోకస్.. ఏడాదికి ఒకసారి పరీక్షకు యోచన: రామ్మోహన్
బీసీలను జగన్ రెడ్డి మోసం చేస్తున్నారు.. యనమల ధ్వజం
వన మహోత్సవం లక్ష్యాలను నిర్ణీత గడువులో పూర్తి చేయాలి: మంత్రి సీతక్క
Read Latest Telangana News And AP News And National News
And Telugu News