సాయికృష్ణ కేసు.. ఆ హోం గార్డ్ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు
ABN , Publish Date - Aug 12 , 2026 | 08:37 PM
గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో నిందితుడు వెంకట్‌ను విజయవాడ మేజిస్ట్రేట్ కోర్టులో సిట్ అధికారులు బుధవారం హాజరు పరిచారు. ఈ నెల 25వ తేదీ వరకు మేజిస్ట్రేట్ కోర్టు రిమాండ్ విధించింది.
విజయవాడ, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో (Gade Saikrishna Custodial Death Case) నిందితుడు వెంకట్‌ను విజయవాడ మేజిస్ట్రేట్ కోర్టులో సిట్ అధికారులు ఈరోజు (బుధవారం) హాజరుపరిచారు. ఈ నెల 25వ తేదీ వరకు మేజిస్ట్రేట్ కోర్టు రిమాండ్ విధించింది. హోం గార్డ్ వెంకట రాజు రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి. సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ఆధారాలు దొరక్కుండా సీఐ నాగరాజు, హెడ్ కానిస్టేబుల్ అశోక్, హోం గార్డ్ వెంకట రాజును ఉపయోగించారని పోలీసులు తెలిపారు. సాయికృష్ణ లాకప్ డెత్ తర్వాత 20-06-26వ తేదీన సిట్ అధికారులు విచారణకు పిలిచినా వెంకటరాజు వాస్తవాలు చెప్పలేదని వెల్లడించారు. ఆయనకు సీసీటీవీ కెమెరాల ఆపరేషన్‌లో అనుభవం ఉందని వివరించారు.
సాయికృష్ణని అక్రమంగా నిర్భందించి దాడి చేసిన ఘటనలో ఆయన చనిపోయారని పోలీసులు రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు. సాయికృష్ణ మృతదేహం మాయం చేయడానికి A 4 సురేశ్ సహకారం అందించారని తెలిపారు. సాయికృష్ణని పోలీస్ స్టేషన్‌కి తీసుకొచ్చిన, ఆ తర్వాత ఆధారాలను ధ్వంసం చేశారని అన్నారు. 14-06-26 తేదీన కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లోని సెల్లార్, అవుట్‌డోర్, ప్రధాన ద్వారం ఎదురుగా ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ను తొలగించారని ప్రస్తావించారు. అదేరోజు పోలీస్ స్టేషన్‌లో సీఐ రూంలోని 4 హార్డ్‌డిస్క్‌లు తొలగించామని అశోక్.. హోం గార్డ్ వెంకటరాజుకు చెప్పారని అన్నారు. హార్డ్‌డిస్క్‌లు తొలగించిన తర్వాత వాటిని కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లోని స్టోర్ రూంలో దాచారని పోలీసులు తెలిపారు.
సీసీటీవీ కెమెరాల్లో హార్డ్‌డిస్క్‌లను తొలగించినట్లు అనుమానం రాకుండా సీసీటీవీ కెమెరాలను ఆన్‌లోనే ఉంచారని పోలీసులు రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు. తొలగించిన హార్డ్‌డిస్క్‌ల స్థానంలో కొత్త హార్డ్‌డిస్క్‌లు ఇన్‌స్టాల్ చేశారని చెప్పారు. ఉద్దేశపూర్వకంగా హోం గార్డ్ హార్డ్‌డిస్క్‌లను తొలగించి ఆ ఆధారాలు ధ్వంసం చేశారని తెలిపారు. సాయికృష్ణ గురించి ఆధారాలేవీ దొరక్కుండా ఉండేందుకు కొత్త ఎన్వీఆర్లు, డీవీఆర్లు ఏర్పాటు చేశారని చెప్పారు. ప్రభుత్వ నియంత్రణ, పర్యవేక్షణలో ఉండాల్సిన డేటాను ఉద్దేశపూర్వకంగా అందరూ కలిసే తొలగించారని పోలీసులు తెలిపారు.
ఈ ఆధారాలను, సాక్ష్యాలను ధ్వంసం చేయడం కోసం అందరూ కలిసి భాగస్వాములు అయ్యారని పోలీసులు అన్నారు. సాయికృష్ణ లాకప్ డెత్ అవ్వడానికి A1 నుంచి A6 వరకు అందరి పాత్ర ఉందని చెప్పుకొచ్చారు. ఓ పథకం ప్రకారమే A1 నుంచి A7 వరకు ఆధారాలను ధ్వంసం చేశారని ప్రస్తావించారు. సీసీటీవీ కెమెరా విజువల్స్ తొలగించడంలో నాగరాజు, అశోక్, వెంకట రాజు ముగ్గురు కీలకంగా ఉన్నారని పోలీసులు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు.
వార్తలు కూడా చదవండి...
వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్య సాధనకు సహకరించాలి: సీఎం చంద్రబాబు
అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి తొలగిన అడ్డంకులు
ఆక్వా రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News