యువత భవిష్యత్తుతో రాజకీయం తగదు.. వైసీపీకి మంత్రి రాంప్రసాద్ రెడ్డి వార్నింగ్
ABN , Publish Date - Sep 07 , 2026 | 03:51 PM
ఏళ్ల తరబడి కష్టపడిన మెగా డీఎస్సీ అభ్యర్థుల కష్టాన్ని, విజయాన్ని అవమానించేలా వైసీపీ ఆరోపణలు చేయడం బాధాకరమని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు.
అమరావతి, సెప్టెంబర్ 7: ఏళ్ల తరబడి కష్టపడిన మెగా డీఎస్సీ అభ్యర్థుల కష్టాన్ని, విజయాన్ని అవమానించేలా వైసీపీ ఆరోపణలు చేయడం బాధాకరమని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ఈరోజు(సోమవారం) మీడియాతో మాట్లాడుతూ.. మెగా డీఎస్సీ అభ్యర్థులను సతాయించడం, వారిపై బురదజల్లడం వైసీపీ నేతలు మానుకోవాలని హితవుపలికారు. 2018లో డీఎస్సీ రాసి ఉద్యోగం రాకపోయినా.. ఏడేళ్ల పాటు పట్టుదలతో చదివి 2025 మెగా డీఎస్సీలో ఉద్యోగాలు సాధించారని తెలిపారు. రాత్రీ పగలు తేడా లేకుండా చదివి, ఎన్నో త్యాగాలు చేసి యువత ఉద్యోగాలు సాధించిందని చెప్పుకొచ్చారు. ఇదే చివరి అవకాశం అయినా పట్టుదలతో ఉద్యోగం సాధించిన వారి విజయాన్ని రాజకీయాల కోసం అవమానించడం సరికాదన్నారు.
అప్లికేషన్ల స్వీకరణ నుంచి మెరిట్ లిస్ట్ వరకు మెగా డీఎస్సీ ప్రక్రియను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించామని మంత్రి తెలిపారు. మెరిట్, అర్హత ఆధారంగా ఉద్యోగాలు పొందిన అభ్యర్థులపై బురదజల్లడం మానుకోవాలని హితవుపలికారు. మెగా డీఎస్సీలో ఎలాంటి అక్రమాలకు తావులేదన్నారు. ఉద్యోగం సాధించిన అభ్యర్థుల విజయాన్ని ప్రశ్నించడం వారి కుటుంబాల ఏళ్ల తరబడి శ్రమను అవమానించడమే అని అన్నారు. యువత భవిష్యత్తుతో రాజకీయాలు చేయడం వైసీపీకి తగదని హెచ్చరించారు. వైసీపీ రాజకీయాల కోసం అభ్యర్థుల కష్టాన్ని అవమానించొద్దని.. వారి భవిష్యత్తుతో ఆటలాడొద్దని అన్నారు. మెగా డీఎస్సీ అభ్యర్థుల ఆవేదనను జగన్ అర్థం చేసుకోవాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
రెచ్చిపోయిన దొంగలు.. ఆలయంలో సీసీటీవీ కెమెరా వైర్లు కట్ చేసి మరీ చోరీ
సాత్విక్-చిరాగ్ జోడీకి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ అభినందనలు
Read Latest AP News And Telugu News