Share News

సాత్విక్‌-చిరాగ్ జోడీకి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ అభినందనలు

ABN , Publish Date - Sep 07 , 2026 | 11:57 AM

చైనా మాస్టర్స్ ఛాంపియన్లుగా నిలిచిన సాత్విక్-చిరాగ్ జోడీపై ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశంసలు కురిపించారు.

సాత్విక్‌-చిరాగ్ జోడీకి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ అభినందనలు
CM Chandrababu

అమరావతి, సెప్టెంబర్ 7: చైనా మాస్టర్స్ ఛాంపియన్లుగా నిలిచిన సాత్విక్-చిరాగ్ జోడీపై ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశంసలు కురిపించారు. సోషల్ మీడియా ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ.. చైనా మాస్టర్స్ 2026లో భారత్‌కు చారిత్రక విజయమని సీఎం అభివర్ణించారు. ఛాంపియన్లుగా నిలిచిన సాత్విక్‌సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడీకి అభినందనలు తెలియజేశారు. షెన్‌జెన్‌లో పురుషుల డబుల్స్ టైటిల్‌ను భారత జోడీ గెలిచిందని.. చైనా మాస్టర్స్ టైటిల్ గెలిచిన తొలి భారత జోడీగా చరిత్రలో నిలిచిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణమైన సాత్విక్‌సాయిరాజ్, కిడాంబి శ్రీకాంత్‌కు చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. ప్రపంచ వేదికపై మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. సాత్విక్-చిరాగ్ విజయంతో భారత బ్యాడ్మింటన్‌ కొత్త శిఖరాలను చేరుకుంటుందని ఎక్స్‌లో సీఎం చంద్రబాబు పోస్ట్ చేశారు.


భారత బ్యాడ్మింటన్‌కు గర్వకారణం: పవన్

చైనా మాస్టర్స్ ఛాంపియన్లుగా సాత్విక్-చిరాగ్ జోడీ నిలిచిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. చైనా జోడీపై అద్భుత పునరాగమన విజయంతో భారత్‌కు చారిత్రక టైటిల్‌ను అందించారన్నారు. 11-21, 21-13, 21-17తో హీ జి టింగ్–రెన్ షియాంగ్ యూపై విజయం సాధించారని తెలిపారు. చైనా మాస్టర్స్ టైటిల్ గెలిచిన తొలి భారతీయులుగా సాత్విక్-చిరాగ్ చరిత్ర సృష్టించారన్నారు. పోరాట పటిమ, ఆత్మవిశ్వాసంతో అద్భుత విజయాన్ని భారత జోడీ సాధించిందని కొనియాడారు. ఈ సందర్భంగా సాత్విక్-చిరాగ్‌కు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అభినందనలు తెలియజేస్తూ.. భారత బ్యాడ్మింటన్‌కు గర్వకారణమంటూ ఎక్స్‌లో ప్రశంసలు కురిపించారు.


ఇవి కూడా చదవండి...

దేశం కోసం పిల్లల్ని కనండి.. 7వ సారి తల్లైన జపాన్ మహిళ పిలుపు

రెచ్చిపోయిన దొంగలు.. ఆలయంలో సీసీటీవీ కెమెరా వైర్లు కట్ చేసి మరీ చోరీ

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 07 , 2026 | 12:18 PM