విజయవాడలో మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఉపాధ్యాయుల రౌండ్ టెబుల్ సమావేశం
ABN , Publish Date - Sep 20 , 2026 | 11:43 AM
మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఉపాధ్యాయులు ఆదివారం విజయవాడలో రౌండ్ టెబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు అభ్యర్థులు మాట్లాడారు. ఉద్యోగాలు సంపాదించేందుకు తాము పడిన కష్టాల గురించి పలువురు ఉపాధ్యాయులు తెలిపారు.
విజయవాడ, సెప్టెంబర్ 20 (ఆంధ్రజ్యోతి): మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఉపాధ్యాయులు ఈరోజు (ఆదివారం) విజయవాడలో రౌండ్ టెబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు అభ్యర్థులు మాట్లాడారు. ఉద్యోగాలు సంపాదించేందుకు తాము పడిన కష్టాల గురించి పలువురు ఉపాధ్యాయులు తెలిపారు. తమపై అనవసరంగా నిందలు మోపవద్దని ఆవేదన వ్యక్తం చేశారు.


టెట్ రాయకుండా ఒక్కరికి కూడా ఉద్యోగం రాలేదు: ఉపాధ్యాయులు
‘రాజకీయ స్వార్థం కోసం తమ జీవితాలను బలి చేయకండి. మా ఆటలు, మా చదువుకు సంబంధించిన అన్ని విషయాలు ఆన్‌లైన్‌లో ఉన్నాయి. ఎవరైనా సరే స్పోర్ట్స్ కోటాలో ఎంపికైన మా వివరాలను పరిశీలించవచ్చు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో మేము పాల్గొన్నాం. టెట్ రాయకుండా ఒక్కరికి కూడా ఉద్యోగం రాలేదు. వాస్తవాలకు విరుద్దంగా మాపై కొంతమంది బురద జల్లుతున్నారు’ అని ఉపాధ్యాయులు తెలిపారు.

మంత్రి లోకేశ్ ఆధ్వర్యంలో పారదర్శకంగా మెగా డీఎస్సీ 2025
‘మెగా డీఎస్సీ 2025 లో మేము స్పోర్ట్స్ కోటాలో ఎంపికయ్యాం. వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది. మేము నిజాయితీగా స్పోర్ట్స్ సర్టిఫికెట్ పొందాం. మేము ఎంతో కష్టపడి స్పోర్ట్స్ ఆడి... ఈ స్థాయికి వచ్చాం. వైసీపీ చేస్తున్న విషప్రచారంతో మేము మానసికంగా కుంగిపోతున్నాం. ఫేక్ సర్టిఫికెట్స్‌తో ఉద్యోగం పొందామంటూ ప్రచారం చేయడం బాధాకరం. రాజకీయ దురుద్దేశంతో వైసీపీ మాపై బురద జల్లుతోంది. వైసీపీ ప్రచారంతో మా మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఇలాంటి ప్రచారంతో సమాజంలో మాపై లేనిపోని విమర్శలు వస్తున్నాయి. వైసీపీ ఆరోపణలు పూర్తిగా అవాస్తవం. మేము ఉద్యోగం పొందిన సంతోషం కన్నా...వైసీపీ చేస్తున్న నిరాధార ఆరోపణలతో బాధ పడుతున్నాం. మంత్రి లోకేశ్ ఆధ్వర్యంలో మెగా డీఎస్సీ 2025 పారదర్శకంగా జరిగింది. వైసీపీ విషప్రచారాన్ని ఖండిస్తున్నాం’ అని మెగా డీఎస్సీ 2025 స్పోర్ట్స్ కోటాలో ఎంపికైన అభ్యర్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

క్రీడలను రాజకీయాలకు వేదిక చేయొద్దు: శివారెడ్డి
విజయవాడలో 'మెగా డీఎస్సీ - 2025’ స్పోర్ట్స్ కోటా ఉపాధ్యాయుల రౌండ్ టేబుల్ సమావేశంలో ఉపాధ్యాయుడు పి.శివారెడ్డి మాట్లాడారు. ‘మన రాష్ట్రం తరఫున 40 జాతీయ ఖో-ఖో పోటీల్లో నేను పాల్గొన్నాను. దేశం తరఫున ఖో-ఖో పోటీల్లో మూడుసార్లు స్వర్ణ పతకాలు సాధించాను. కులమతాలకు అతీతమైన క్రీడలను రాజకీయాలకు వేదిక చేయొద్దు. క్రీడాకారుల కష్టాన్ని గుర్తించి కూటమి ప్రభుత్వం మూడు శాతం రిజర్వేషన్ కల్పించడం చారిత్రక నిర్ణయం. ఈ రిజర్వేషన్ నిర్ణయం భవిష్యత్తు తరాల క్రీడాకారులకూ ఉపయోగపడాలి. దేశం, రాష్ట్రం కోసం శ్రమించిన క్రీడాకారులను అవమానించేలా కొందరు మాట్లాడటం దుర్మార్గం. మాపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలతో తీవ్ర అవమానానికి గురవుతున్నాం. క్రీడాకారుల కష్టాన్ని తేలిక చేసి మాట్లాడటం సరికాదు. జీవితాలను క్రీడలకే త్యాగం చేసిన వారికి కూటమి ప్రభుత్వం సరైన గుర్తింపునిచ్చింది. ప్రభుత్వం గుర్తించిందనే సంతోషం కూడా లేకుండా మాపై అసత్య ప్రచారాలు చేస్తున్నారు. నిరాధార ఆరోపణలతో తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్నాం’ అని ఉపాధ్యాయుడు పి.శివారెడ్డి పేర్కొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..
సెప్టెంబర్ 21, 22 తేదీల్లో చిత్తూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
స్థానిక ఎన్నికల్లో వందశాతం స్ట్రైక్ రేట్‌తో గెలుస్తాం: మంత్రి నాదెండ్ల మనోహర్
ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్.. చేనేత పెన్షన్ల వెరిఫికేషన్ అక్రమాలపై మంత్రి సవిత సీరియస్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News