కృష్ణా జిల్లాలో క్షణికావేశంలో తమ్ముడిని హత్య చేసిన అన్న
ABN , Publish Date - Oct 03 , 2026 | 05:29 PM
కృష్ణా జిల్లాలో క్షణికావేశంలో తమ్ముడిని అన్న హత్య చేశాడు. ఈ ఘటన ఘంటసాల మండలం దేవర కోటలో జరిగింది.
కృష్ణా జిల్లా, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): కృష్ణా జిల్లాలో క్షణికావేశంలో తమ్ముడిని అన్న హత్య చేశాడు. ఈ ఘటన ఘంటసాల మండలం దేవర కోటలో జరిగింది. మద్యానికి బానిసై కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్న తమ్ముడు రాజ్‌కుమార్‌ని క్షణికావేశంలో అన్న విజయ్ కుమార్ హత్య చేశాడు. తాగి రోడ్డుపై పడి ఉన్న తమ్ముడిని ఇంటికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన క్రమంలో ఈ గొడవ చోటుచేసుకుంది. అయితే, తమ్ముడు ప్రవర్తనతో విసిగిపోయి అన్న చేయి చేసుకున్నాడు.
ఇద్దరి మధ్య వాదన పెరగటంతో తమ్ముడిపై అన్న రాయితో దాడి చేశాడు. అయితే, రాయితో కొట్టడంతో అక్కడికక్కడే రాజ్‌కుమార్ మృతి చెందాడు. దీంతో భయపడి విజయవాడకు అన్న విజయ్ కుమార్ పరారయ్యాడు. సమాచారం అందగానే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విజయ్ కుమార్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా తయారు చేస్తాం: సీఎం చంద్రబాబు
నన్ను ఆంధ్ర బిడ్డగా భావించండి: అనంత్ అంబానీ
ప్రభుత్వ విద్యాసంస్థలపై నమ్మకాన్ని పెంచుతున్నాం: ఎంపీ శ్రీభరత్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News