Share News

ఆ సంస్థకు ఈడీ నుంచి నోటీసు వచ్చింది: ఎంపీ శివనాథ్

ABN , Publish Date - May 25 , 2026 | 11:36 AM

ఇశాన్వీ, కేశినేని డెవలపర్స్ సoస్థలు కలిసి చేసిన రియల్ ఎస్టేట్ సంస్థకు ఈడీ అధికారుల నుంచి ఓ నోటీసు వచ్చిందని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ తెలిపారు. ఆ కంపెనీకి వచ్చిన నోటీసుపై ఈనెల 27వ తేదీన వివరణ ఇస్తామని పేర్కొన్నారు.

ఆ సంస్థకు ఈడీ నుంచి నోటీసు వచ్చింది: ఎంపీ శివనాథ్
Kesineni Sivanath

విజయవాడ, మే 25 (ఆంధ్రజ్యోతి): ఇశాన్వీ, కేశినేని డెవలపర్స్ సoస్థలు కలిసి చేసిన రియల్ ఎస్టేట్ సంస్థకు ఈడీ అధికారుల నుంచి ఓ నోటీసు వచ్చిందని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) (Kesineni Sivanath) తెలిపారు. ఆ కంపెనీకి వచ్చిన నోటీసుపై ఈనెల 27వ తేదీన వివరణ ఇస్తామని పేర్కొన్నారు. పక్క పక్క సైట్లు ఉండటంతో రాజ్ కసిరెడ్డికి సంబంధించిన ఇశాన్వీ సంస్థతో 2021లో రియల్ ఎస్టేట్ చేసేందుకు ప్రైడ్ ఇన్‌ఫ్రా సంస్థ ఏర్పాటు చేశామని ప్రస్తావించారు. ఆ సంస్థ ద్వారా రూ.35 లక్షల లావాదేవీలు జరిగాయని తెలిపారు. ఈరోజు (సోమవారం) విజయవాడ వేదికగా కేశినేని శివనాథ్ మీడియాతో మాట్లాడారు.


ఆ కంపెనీ నుంచి బయటకు వచ్చేశాం..

రాజ్ కసిరెడ్డి సంగతి తెలిశాక 2022లోనే.. ఆ కంపెనీ నుంచి బయటకు వచ్చేశామని కేశినేని శివనాథ్ స్పష్టం చేశారు. ఆ లావాదేవీకి సంబంధించే ఈడీ అధికారులు సమాధానం కోరుతూ నోటీసు పంపించారని వెల్లడించారు. ఆర్కిటెక్ ఫీజు కోసం చేసిన రూ.35లక్షల ట్రాన్సాక్షన్ తప్ప ఇంకేమి జరుగలేదనే విషయాన్ని ఈడీ అధికారులకు చెబుతామని తెలిపారు. ఏపీ లిక్కర్ స్కామ్‌లో తన భార్యకు నోటీసులు ఇచ్చినట్లు వచ్చిన ఆరోపణలు అవాస్తవమని అన్నారు. అప్పుడు పెట్టిన కంపెనీలో తన భార్య ఓ డైరెక్టర్ మాత్రమేనని తేల్చిచెప్పారు. ఆ కంపెనీకి నోటీసు వచ్చిందే తప్ప.. తన భార్యకు ఎలాంటి నోటీసు రాలేదని ఎంపీ కేశినేని శివనాథ్ స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి...

రక్తచరిత్ర ఎవరిదో ప్రజలకు తెలుసు.. జగన్ అండ్ కోపై మంత్రి నారాయణ ధ్వజం

కూటమి ప్రభుత్వంలో పేదల ఆరోగ్య సంరక్షణకు పెద్దపీట వేస్తున్నాం: మంత్రి అనగాని

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 25 , 2026 | 12:26 PM