దయచేసి మాలాంటోళ్లను ఆదుకోండి సర్.. దివ్యాంగుడి ఆవేదన
ABN , Publish Date - Apr 14 , 2026 | 03:29 PM
పింఛన్ ఇప్పించే ఏర్పాటు చేస్తానంటూ స్వయంగా సీఎం చంద్రబాబు హామీ ఇచ్చినా.. ఇప్పటికీ నెరవేరలేదంటూ దుర్గారావు అనే దివ్వాంగుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డైరెక్టర్ భానుప్రకాశ్ కోగంటి సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
అమరావతి, ఏప్రిల్ 14: గతేడాది అక్టోబర్‌లో ‘సూపర్ జీఎస్టీ.. సూపర్ సేవింగ్స్’ కార్యక్రమంలో భాగంగా విజయవాడలోని బీసెంట్ రోడ్డులో చిరు వ్యాపారులతో మాట్లాడారు సీఎం చంద్రబాబు నాయుడు. వారి వ్యాపారం, ఆర్థిక పరిస్థితి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అక్కడే దివ్యాంగుడైన దుర్గారావుతోనూ ముఖ్యమంత్రి ముచ్చటించి.. ఆయన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కానీ.. వాటి పరిష్కారం దిశగా ఇప్పటివరకు ముందడుగు పడలేదు. ఇదే విషయమై తాజాగా.. ‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి’ డైరెక్టర్ భానుప్రకాశ్ కోగంటి సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు.
దుర్గారావు మాటల్లో..
‘నాకు పింఛన్ రావడం లేదని సీఎం చంద్రబాబుకు చెప్పాను. పింఛన్, ఇళ్లు, జీవనోపాధి కల్పించాలని కోరా. అందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి అన్నీ ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. అప్పటి నుంచి ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా. ఎవరూ పట్టించుకోవడం లేదు’ అని దుర్గారావు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి...
అంబేడ్కర్ స్ఫూర్తితో రాజకీయ నేతలు ముందుకు సాగాలి: మంత్రి బీసీ జనార్దన్
అలాంటి నాయకత్వంలోనే గొప్ప నగరాలు రూపుదిద్దుకుంటాయి: బుద్దా వెంకన్న
Read Latest AP News And Telugu News