Share News

అంబేడ్కర్ స్ఫూర్తితో రాజకీయ నేతలు ముందుకు సాగాలి: మంత్రి బీసీ జనార్దన్

ABN , Publish Date - Apr 14 , 2026 | 11:20 AM

అంబేడ్కర్ రచించిన రాజ్యాంగ స్ఫూర్తితోనే నేడు మనమంతా ప్రజాస్వామ్య విధానాలతో ముందుకు సాగుతున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. నేటితరం రాజకీయ నాయకులు ఆయన స్ఫూర్తితో ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు.

అంబేడ్కర్ స్ఫూర్తితో రాజకీయ నేతలు ముందుకు సాగాలి: మంత్రి బీసీ జనార్దన్
Ambedkar Jayanti 2026

నంద్యాల, ఏప్రిల్ 14: రాజ్యంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్ఫూర్తితోనే సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం దళితుల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతోందని మంత్రి బీసీ జానర్దన్ రెడ్డి తెలిపారు. బనగానపల్లె అవుకుమెట్ట దగ్గర అంబేడ్కర్ జయంతి వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి, ఘన నివాళులర్పించారు. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగ స్ఫూర్తితోనే నేడు మనమంతా ప్రజాస్వామ్య విధానాలతో ముందుకు సాగుతున్నామని మంత్రి వెల్లడించారు. నేటితరం రాజకీయ నాయకులు ఆయన స్ఫూర్తితో ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు.


నేడు అవుకుమెట్టలో ఉన్న అంబేడ్కర్ విగ్రహాన్ని రోడ్డు విస్తరణలో భాగంగా వేరే ప్రాంతానికి తరలించాల్సి ఉందని మంత్రి తెలిపారు. ఇప్పటికే ఈ విగ్రహం శిథిలావస్థకు చేరుకున్న నేపథ్యంలో సరైన స్థలాన్ని ఎంపిక చేసి అక్కడ నూతన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు. స్థానిక నాయకులతో చర్చించి, చిరకాలం గుర్తుండేలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని, అనువైన ప్రాంతంలో అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రకటించారు. ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున దళిత సంఘాల నాయకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.


ఇవి కూడా చదవండి...

తమ్ముడిని నిద్రపుచ్చి ఉయ్యాల ఊగుతున్న చిన్నారి.. అంతలోనే

ఏపీలో అగ్నిమాపక శాఖ వారోత్సవాలు.. అమరవీరుల స్మృతికి డీజీపీ నివాళి

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 14 , 2026 | 11:21 AM