Share News

జువ్వలదిన్నెపై వైసీపీ నీచ రాజకీయం: మంత్రి అనగాని సత్యప్రసాద్

ABN , Publish Date - Apr 14 , 2026 | 09:55 AM

దేశంలోనే తొలి అటానమస్ మారిటైం షిప్ యార్డ్‌గా జువ్వలదిన్నె అభివృద్ధి చెందబోతోందని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. జువ్వలదిన్నె హార్బర్, రామాయపట్నం పోర్టులకు పట్టిన గ్రహణం జగన్ రెడ్డి అంటూ వ్యాఖ్యానించారు.

జువ్వలదిన్నెపై వైసీపీ నీచ రాజకీయం: మంత్రి అనగాని సత్యప్రసాద్
Anagani Satyaprasad

అమరావతి, ఏప్రిల్ 14: జువ్వలదిన్నెపై వైసీపీ నీచ రాజకీయం చేస్తోందని మంత్రి అనగాని సత్యప్రసాద్(Minister Anagani Satyaprasad) ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. దేశంలోనే తొలి అటానమస్ మారిటైం షిప్ యార్డ్‌గా జువ్వలదిన్నె అభివృద్ధి చెందబోతోందని తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌ ఏర్పాటుతో షిప్ బిల్డింగ్, అటానమస్ సిస్టమ్స్ డెవలప్‌మెంట్, మెరైన్ ఇంజనీరింగ్, పరిశోధన, అభివృద్ధి రంగాల్లో యువతకు ఉద్యోగాలు లభిస్తాయని చెప్పుకొచ్చారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా మారిటైం రోబోటిక్స్, అటానమస్ షిప్ బిల్డింగ్ హబ్‌‌గా ఏపీ నిలవనుందన్నారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను రూ.288.80 కోట్ల పెట్టుబడితో అభివృద్ధి చేశామని మంత్రి తెలిపారు.


హార్బర్ నిర్మాణం ద్వారా 25 వేల మత్స్యకార కుటుంబాల జీవితాలు సమూలంగా మారబోతున్నాయని మంత్రి అనగాని అన్నారు. 1,250 మెకనైజ్డ్, మోటరైజ్డ్ చేపల పడవలను సురక్షితంగా నిలిపేలా సదుపాయం కల్పించామన్నారు. కానీ అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్న మాజీ సీఎం జగన్ రెడ్డి జువ్వలదిన్నెపై విషం కక్కుతున్నారంటూ విరుచుకుపడ్డారు. జగన్ రెడ్డి ఐదేళ్లు అధికారంలో ఉండి.. ఒక్క హార్బర్‌ను గానీ, ఒక్క పోర్టును గానీ పూర్తి చేయలేకపోయారని అన్నారు. జువ్వలదిన్నె హార్బర్, రామాయపట్నం పోర్టులకు పట్టిన గ్రహణం జగన్ రెడ్డి అంటూ వ్యాఖ్యానించారు.


జగన్ ఆర్థిక ప్రయోజనాల కోసం తీరంలో కొత్త పోర్టులు, హార్బర్లు రాకుండా గతంలో మాజీ సీఎం వైఎస్సార్ జీవోలు ఇచ్చారని మంత్రి గుర్తుచేశారు. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వ చర్యలతో జువ్వలదిన్నె హార్బర్‌తో పాటు రామాయపట్నం పోర్టులో కదలికవచ్చిందన్నారు. 2019 మార్చి 7న జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌కు రూ. 288 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు వచ్చాయన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక టెండర్లు ఇచ్చి డబ్బులు తిన్నారే తప్ప జువ్వలదిన్నె హర్బర్ నిర్మాణం పట్టించుకోలేదని ఆరోపించారు. 15వ తేదీన ఏం చెప్పడానికి జగన్ జువ్వలదిన్నె వస్తున్నారని ప్రశ్నించారు. కృష్ణపట్నం పోర్టు నుంచి వాడరేవు వరకు తీరంలో ఏ నిర్మాణం చేపట్టకుండా తండ్రి అధికారంతో జీఓ తెచ్చానని చెబుతారా అంటూ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి అనగాని సత్యప్రసాద్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.


ఇవి కూడా చదవండి...

26 నుంచి చిన్న వెంకన్న బ్రహ్మోత్సవాలు

తమ్ముడిని నిద్రపుచ్చి ఉయ్యాల ఊగుతున్న చిన్నారి.. అంతలోనే

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 14 , 2026 | 09:59 AM