Share News

దయచేసి వైసీపీ ట్రాప్‌లో పడొద్దు.. చంద్రబాబు ఉంటేనే ఏపీకి భవిష్యత్తు: బుద్దా వెంకన్న

ABN , Publish Date - Jul 27 , 2026 | 11:32 AM

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో నేటి నుంచి ఇంటింటి ప్రచారం కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు ప్రారంభించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి బుద్దా వెంకన్న ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం చేపట్టారు.

దయచేసి వైసీపీ ట్రాప్‌లో పడొద్దు.. చంద్రబాబు ఉంటేనే ఏపీకి భవిష్యత్తు: బుద్దా వెంకన్న
Budda Venkanna

విజయవాడ, జులై 27: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో నేటి(సోమవారం) నుంచి ‘ఇంటింటి ప్రచారం’ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు ప్రారంభించారు. ఇందులో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి బుద్దా వెంకన్న ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా భవానీపురం 40వ డివిజన్‌లో ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు టీడీపీ నేత వివరించారు. పెన్షన్‌లు, మౌలిక సదుపాయాల గురించి ప్రజలు అడుగగా.. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అర్హులకు అందేలా చేస్తానని బుద్దా వెంకన్న హామీ ఇచ్చారు.


అనంతరం బుద్దా వెంకన్న మీడియాతో మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వంలో ప్రజలకు సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. నాయకులు అందరం కూడా కలిసి పని చేస్తున్నామని చెప్పారు. అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రాన్ని చంద్రబాబు గాడిలో పెట్టారన్నారు. ‘సూపర్ సిక్స్’ పథకాలన్నీ కూడా అమలు చేస్తున్నట్లు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఆగిపోయిన పోలవరం, అమరావతి పనులను పరుగులు తీయిస్తున్నారని వెల్లడించారు. చంద్రబాబు విజన్, ముందు చూపు చూసి వైసీపీ నేతలు ఓర్చుకోలేక పోతున్నారని విమర్శించారు.


ఏపీలో కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే కుట్రలను వైసీపీ అధినేత జగన్ ప్రోత్సహిస్తున్నారని బుద్దా వెంకన్న ఆరోపించారు. ‘ఒక రోజేమో కులాల గురించి మాట్లాడతారు. ఇంకో రోజేమో గర్జనలు అంటారు. అంటే ఈ రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవడం వాళ్లకు ఇష్టం లేదు. ఏదో ఒక కార్యక్రమాన్ని పెట్టి, ప్రభుత్వంపై బురద జల్లడమే జగన్ విధానం. ఆ రోజుల్లో రుషులు.. యాగాలు చేసేటప్పుడు రాక్షసులు దాన్ని పాడు చేసినట్టు... ఏదో ఒక రకంగా ఏపీని పాడు చేద్దామనే తలంపుతో వైసీపీ పార్టీ, జగన్ మోహన్ రెడ్డి ఉన్నారు. దయచేసి ప్రజలు ఆ ట్రాప్‌లో పడకండి’ అని సూచించారు. ఈరోజు చంద్రబాబుకు లక్ష్మణుడిలాగా పవన్ కల్యాణ్ కూడా అండగా ఉన్నారని టీడీపీ నేత అన్నారు. ఒక తమ్ముడిలాగా కూటమి ప్రభుత్వాన్ని చక్కగా సమన్వయంతో నడిపిస్తున్నారని పవన్‌ను కొనియాడారు. ప్రధాని మోదీ ఈ రాష్ట్రానికి కావాల్సిన నిధులను అందజేస్తున్నారని అన్నారు. చంద్రబాబు ఉంటేనే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు అని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఇంకా 30 ఏళ్లు ఉంటుందని బుద్దా వెంకన్న పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి.. సీఎం, డిప్యూటీ సీఎం నివాళులు

ఘనంగా శాకంబరీ ఉత్సవాలు.. వివిధ రకాల పండ్లు, కూరగాయలతో దుర్గమ్మ దర్శనం

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 27 , 2026 | 11:38 AM