ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి.. సీఎం, డిప్యూటీ సీఎం నివాళులు
ABN , Publish Date - Jul 27 , 2026 | 10:27 AM
భారతరత్న, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నివాళులర్పించారు.
అమరావతి, జులై 27: భారతరత్న, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నివాళులర్పించారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. దేశానికి శాస్త్ర, సాంకేతికపరంగా అబ్దుల్ కలాం ఎన్నో విజయాలను అందించారని సీఎం కొనియాడారు. ఆధునిక భారతదేశపు గొప్ప జాతి నిర్మాతలలో ఏపీజే ఒకరని పవన్ అన్నారు.
సీఎం చంద్రబాబు పోస్ట్..
‘దేశానికి శాస్త్ర, సాంకేతికపరమైన ఎన్నో విజయాలను అందించి, మిస్సైల్ మ్యాన్‌గా గుర్తింపు పొందిన భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను. తన నిరాడంబరత, నిజాయితీ, మానవతా దృక్పథం వంటి విశిష్ట లక్షణాలతో ప్రజల రాష్ట్రపతిగా కలాం పిలువబడ్డారు. ఆ మహనీయుని వర్ధంతి సందర్భంగా స్మృతికి నివాళులు’ అంటూ సీఎం పోస్ట్ చేశారు.
అబ్దుల్ కలాంకు వినయపూర్వక నివాళులు: పవన్
డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఒక జాతి భవిష్యత్తును తీర్చిదిద్దుతూనే ఉన్న ఒక దార్శనికతను వదిలి వెళ్లారని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. ఆయన వర్ధంతి సందర్భంగా, భారతరత్న డాక్టర్ ఏ.పి.జె. అబ్దుల్ కలాంకు వినయపూర్వక నివాళులు అర్పించారు. ఆయనను ‘భారత క్షిపణి మానవుడు’, ఇస్రో, డీఆర్‌డీఓ ద్వారా భారతదేశ అంతరిక్ష, రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేసిన ప్రముఖ శాస్త్రవేత్త, భారతదేశ 11వ రాష్ట్రపతి, స్ఫూర్తిదాయకమైన ఉపాధ్యాయుడు, ఆధునిక భారతదేశపు గొప్ప జాతి నిర్మాతలలో ఒకరు అంటూ పవన్ కల్యాణ్ కొనియాడారు.
ఇవి కూడా చదవండి...
పరీక్షా విధానంలో సంస్కరణలకు.. హైపవర్డ్ టాస్క్‌ఫోర్స్
విదేశీ యువతిపై అసభ్య ప్రవర్తన.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై కేసు
Read Latest AP News And Telugu News