షర్మిలకు విజయవంతంగా శస్త్ర చికిత్స
ABN , Publish Date - Jul 27 , 2026 | 05:39 AM
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు శనివారం హైదరాబాద్ కాంటినెంటల్ ఆసుపత్రిలో..
త్వరగా కోలుకోవాలని సీఎం చంద్రబాబు ట్వీట్
అమరావతి, జూలై 26(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు శనివారం హైదరాబాద్ కాంటినెంటల్ ఆసుపత్రిలో చేసిన శస్త్ర చికిత్స విజయవంతమైంది. ఇటీవల కొద్దిరోజులు తీవ్ర కడుపునొప్పితో బాధపడిన ఆమె ఉదయం ఆస్పత్రిలో చేరగా వైద్యులు వెంటనే పరీక్షలు జరిపి.. శస్త్ర చికిత్స చేశారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడ ఉందని ధ్రువీకరిస్తూ ఏపీసీసీ ఆధికారిక ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేసింది. కాగా, ఈ విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు.. షర్మిల త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. షర్మిల సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజాక్షేత్రంలోకి రావాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు ఎక్స్‌లో పేర్కొన్నారు. మంత్రి లోకేశ్ కూడా షర్మిల త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.